Macherla Niyojakavargam Trailer:
యంగ్ హీరో నితిన్ నటించిన తాజా మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. ప్రస్తుతం ఈ సినిమాపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ మూవీ దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి రెండు కులాలను కించపరిచాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణలన్నీ ఫేక్ అంటూ ఇప్పటికే చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అంచనాలకు తగ్గట్లుగానే ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఒకవైపు ఫన్.. మరోవైపు యాక్షన్ అంటూ కలెక్టర్ పాత్రలో నితిన్ తనలోని అన్ని కోణాలను బయటపెట్టాడు. జిల్లా కలెక్టర్‌గా రాజప్ప అనే విలన్‌ను ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా కథను అల్లుకున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.
Read Also: Progress report: హిట్టే లేని జూలై!
మరోవైపు హీరో నితిన్ పలువురు దర్శకుల పేర్లను తన సినిమాలో వాడుకున్నాడు. ఒకవైపు త్రివిక్రమ్‌లా పంచు డైలాగులు, మరోవైపు బోయపాటిలా యాక్షన్ సీన్‌లు చేస్తుంటే తాను రాజమౌళి సినిమా తరహాలో ఎలివేషన్‌లు ఇవ్వాలా అంటూ నితిన్ డైలాగులు చెప్పాడు. నితిన్ సరసన హీరోయిన్లుగా కృతి శెట్టి, కేథరిన్ నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అంజలితో ‘జయం’ మూవీలోని రాను రాను అంటూనే చిన్నదో అనే సూపర్ హిట్ పాటను ఇందులో రీమిక్స్ చేశారు. ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది.