Nithiin: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తుండగా.. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ .. వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఇక తాజాగా ఒక ప్రెస్ మీట్ లో నితిన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీని ఇరికించేశాడు. గతంలో ఆయన నిర్మించిన మ్యాడ్ సినిమా ప్రెస్ మీట్ లో .. సినిమాకు వెళ్లి ఒక్కసారి కూడా నవ్వకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ విషయాన్నీ గుర్తుచేసిన నితిన్.. మా సినిమా కు వచ్చి ఒక్కసారైనా నవ్వకపోతే.. నిర్మాత నాగవంశీ మీ టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాడు అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు, నాగవంశీకి మధ్య లావాదేవీలు చాలా ఉన్నాయని కూడా చెప్పుకొచ్చాడు.
ఇక నితిన్ మాటలకు నిర్మాత నాగవంశీ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా.. నితిన్ కు సమాధానం ఇచ్చాడు. ” ఆరోజు మ్యాడ్ వైబ్ లో అనేశాము.. నితిన్ స్వామి.. మీరు ఇలా లాక్ చేస్తే ఎలా” అంటూ చెప్పగా.. నితిన్ .. ” చూసుకోవాలి కదా స్వామి ఏదో ఎక్స్టా ఆర్డినరీ వైబ్ లో నేను అనేశా.. అది ఓకే కానీ, గుంటూరు కారం సెకండ్ సింగిల్ గురించి అప్డేట్ ఏంటి” అని అడిగాడు. ఇక దానికి నాగవంశీ సమాధానమిస్తూ.. ” ఇంకో రెండు రోజుల్లో అప్డేట్ ఇస్తాం ” అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో ఇరికిస్తే ఇరికించాడులే.. గుంటూరు కారం అప్డేట్ ఐతే వచ్చేలా చేశాడు అని మహేష్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి.
Work is going on @actor_nithiin Swamy… Just inko couple of days lo Super 🎻🎼 Announcement istham 😌🥳#GunturKaaram https://t.co/OUgbqnvlR7
— Naga Vamsi (@vamsi84) December 3, 2023