మెగా డాటర్ నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా మారుతుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వరుస అపజయాలు ఎదురవడంతో వెనక్కి తగ్గింది. ఇక పెద్దల మాట విని జొన్నలగడ్డ చైతన్యను వివాహమాడిన అమ్మడు.. నిర్మాతగా మారింది. కొత్త కథలను, యంగ్ ట్యాలెంట్ ని నమ్ముకొని వెబ్ సిరీస్ లు నిర్మించి విజయాలను అందుకుంది. ఇక నిహారిక కెరీర్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ గా కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం భర్త చైతన్య తో కలిసి దిగిన ఫోటోలు, ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఏమైందో ఏమో తెలియదు కానీ సడెన్ గా నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్స్ చూపంతా మెగా డాటర్ పై పడింది.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించే నిహారికి సడెన్‌గా అకౌంట్ డిలీట్ చేయడం ఏంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే నిహా అకౌంట్ డిలీట్ చేయడం వెనుక కారణం ఇదేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిహారికకు, యూట్యూబర్ నిఖిల్ కి మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ కనిపిస్తారు.. ఇక ఇటీవల నిహారిక ఒక ఫోటో పోస్ట్ చేసింది. జిమ్ లో నిఖిల్ పై ఎక్కి కూర్చుంటే అతడు పుషప్స్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోపై నెటిజన్స్ తీవ్రగా ట్రోల్ చేశారు. మెగా డాటర్ అయ్యి ఉండి, అందులోనూ పెళ్లి అయ్యి ఏంటి ఈ పనులు.. అని కొందరు.. మెగా ఫ్యామిలీ పరువు టియాకు అని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారని.. అందుకే నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేసిందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే మెగా డాటర్ నోరు విప్పాల్సిందే..