Niharika : మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ అవుతోంది. ఆమె నిర్మాతగా మారి వరుసగా వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాలను కూడా తీస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు వెళ్లిన నిహారిక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఒకవేళ నువ్వు టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సి వస్తే ఎవరితో ఎలాంటి సినిమాలు తీస్తావ్ అని యాంకర్ ప్రశ్నించారు. దానికి నిహారిక స్పందిస్తూ.. అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉంది. మహేశ్ బాబుతో పీరియాడికల్ మూవీ చేస్తా.
Read Also : Vijay Devarakonda : బిజీ లైఫ్ లో పేరెంట్స్ తో గడపండి.. విజయ్ స్పెషల్ పోస్ట్
ఒకవేళ డైరెక్టర్ గా మారితే ఫస్ట్ సినిమా రామ్ చరణ్ అన్నయ్యతోనే ఉంటుంది. ఎక్కువగా మేకప్ వేసుకోవద్దని నాలో ఉన్న యాంకర్ కు చెబుతాను. నేను నిర్మాతగా మారిన తర్వాత సినిమాల విషయంలో నన్ను నేను నమ్ముకోవాలని ఎప్పటికప్పుడు నాకు నేనే సలహాలు ఇచ్చుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలా వరకు నాకు నేనే సలహాలు ఇచ్చుకుంటాను.
ఎవరినీ నేను రిక్వెస్ట్ చేయను. ఎవరిపై ఆధారపడటం నాకు నచ్చదు. నాకు నచ్చిన స్క్రిప్ట్ లను ఎంచుకోవడం కాదు.. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అలాంటి స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ వెళ్తున్నాను. ఫ్యూచర్ లో మంచి సినిమాలు తీసే నిర్మాతగా మారుతాను అనే నమ్మకం అయితే నాకు ఉంది అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.
Read Also : Samantha : మాకు సినిమా చూపించడానికి అమ్మ చాలా కష్టపడింది