Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ఆమె భర్త నిక్ జోనాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ జంట మధ్య పదేళ్ల గ్యాప్ ఉంది. అయినా ప్రేమకు వయస్సుతో పనేంటి అని నిరూపిస్తూ.. ప్రియాంక- నిక్ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొన్నారు. ఇక ప్రియాంక కన్నా నిక్ పదేళ్లు చిన్న.. వీరి జంటను ఎవరు చూసినా ప్రియాంక, నిక్ కు అక్కలా ఉంది అంటారు. అలాంటివన్నీ వీరు పట్టించుకోరు అనుకోండి అది వేరే విషయం. రెండేళ్లక్రితం ఈ జంట.. సరోగసీ ద్వారా ఆడపిల్లకు జన్మినిచ్చారు. ఆమె పేరు మాల్తీ. అమెరికా కోడలు అయ్యాకా పీసీ.. హాలీవుడ్ సినిమాల్లోనే కనిపిస్తుంది. అప్పుడప్పుడు బాలీవుడ్ లో మెరుస్తుంది. ఈ మధ్యనే ఆమె నటించిన సిటాడెల్ రిలీజ్ అయ్యి మంచి పేరునే సంపాదించుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూలో ఇప్పటివరకు ఎవరికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది.
SS 4: గాలోడు కొత్త సినిమా మొదలై పోయింది!
నిక్ కు 7 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు తనకు 17 ఏళ్ళ వయస్సు అని, తాను మిస్ వరల్డ్ పోటీలకు వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. ఆ షోను తన తల్లితో కలిసి నిక్ చూసి ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయాన్నీ తన అత్తగారు చెప్పినట్లు కూడా తెలిపింది. ” నువ్వు 2000- మిస్ వరల్డ్ పోటీలో గెలిచినప్పుడు టీవీల్లో చూడటం నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు నువ్వు లండన్ లో ఉన్నావు. నేను టెక్సాస్ లో ఉన్నాను.. నా పక్కన ఏడేళ్ల వయసున్న నిక్.. నాతో పాటు ఆ షో చూసి.. తెగ మురిసిపోయాడట.. మిస్ వరల్డ్ పోటీల్లో విజేతను అయిన క్షణాన్ని టీవీల్లో చూశారని ఆమె నాతో చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. 22 సంవత్సరాల క్రితం ఘటన అది.. అప్పుడు నా వయస్సు 17 కాగా.. నిక్ వయస్సు 7.. చాలా విచిత్రంగా ఉంది కదా” అంటూ ప్రియాంక నవ్వులు చిందించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.