SS 4: జబర్దస్త్ తో పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. ‘సాఫ్ట్ వెర్ సుధీర్’ సినిమా తో పాటు ”త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు ” సినిమాలలో హీరోగా నటించాడు. తాజాగా అతను హీరోగా నాలుగో సినిమా షూటింగ్ మొదలైంది. సుడిగాలి సుధీర్ , దివ్యభారతి హీరోహీరోయిన్లుగా ‘పాగల్’ ఫేమ్ దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్ దామోదర ప్రసాద్ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
Sunny: ‘అన్ స్టాపబుల్’ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఖరారు!
నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మాట్లాడుతూ , ఈ సినిమా స్క్రిప్ట్ ఒన్ ఇయర్ క్రితమే ఫైనల్ అయిపోయింది. 4, 5 నెలల నుండి ప్రీ ప్రొడక్షన్ గట్టిగా చేశాం. ఈ సినిమాకు సంబంధించి బెక్కం వేణుగోపాల్ గారే కర్త, కర్మ , క్రియ అన్ని. ఈ సినిమాకు లియో మ్యూజిక్ అందిస్తున్నాడు. మా సినిమాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ… సుధీర్ గారికి ఈ కథను ఒక గంట నేరేట్ చేయగానే ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నారు.మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా అన్ని చేసి పెట్టారు. మా రైటర్ ఫణి కి థాంక్యూ” అన్నారు. ఈ సందర్భం గా తనకు దన్ను గా నిలిచిన మీడియా కు సుధీర్ ధన్యవాదాలు తెలిపారు.