నూతన దర్శకుడు భార్ఘవ్ మాచర్ల దర్శకత్వంలో వస్తున్న వెబ్ మూవీ “నెట్”. రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది. రాహుల్‌కు మంచి స్నేహితుడైన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా “నెట్” ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ “రాహుల్ … మీరు అరుదైన ప్రతిభావంతుడు. నాకు ట్రైలర్ బాగా నచ్చింది” అంటూ ట్రైలర్ ను షేర్ చేశారు.
Read Also : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎందుకు ఇన్వాల్ అయ్యిందంటే ?
ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సీక్రెట్ కెమెరాల మధ్య ప్రియా అనే అమ్మాయి జీవితంలోకి రహస్యంగా తొంగి చూసే మధ్యతరగతి వివాహితుడి కథతో ఈ మూవీ తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. అయితే అది అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? అనేది సినిమాకి ప్రధాన అంశం. పక్కింటి అబ్బాయిలా కనిపించే రాహుల్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. అవికా గోర్ చాలా రోజుల తరువాత తెలుగు తెరపై కనిపించబోతోంది. C/o కంచెరపాలెం ఫేమ్ ప్రణీత పట్నాయక్ ఈ సినిమాలో రాహుల్ భార్యగా నటించారు. “నెట్” మూవీ సెప్టెంబర్ 10న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. సరైన కథతో తెరపై సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూపించగలిగితే సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌లకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. మరి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.