Bellamkonda Ganesh: ఐ ఫోన్ దొంగిలించి, గణేశ్ ను ట్రాప్ చేసింది ఎవరు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nenu Student Sir: తొలి చిత్రం ‘స్వాతిముత్యం’తో ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ నటిస్తున్న మలి చిత్రం ‘నేను స్టూడెంట్ సర్!’. ప్రముఖ దర్శకుడు తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘నాంది’ సతీశ్ వర్మ దీనిని నిర్మిస్తున్నారు. బెల్లంకొండ గణేశ్ సరసన అలనాటి నటి భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దస్సాని హీరోయిన్ గా నటిస్తోంది. శనివారం ఈ మూవీ టీజర్ విడుదలైంది. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఐ ఫోన్ ను కొనుకున్న గణేశ్… ఆ వెంటనే దాన్ని పోగొట్టుకుంటాడు. పోలీస్ కమీషనర్ ను కలిసి తన ఫోన్ కొట్టేసింది పోలీసులే అని కంప్లయిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. స్టూడెంట్ అయిన గణేశ్ ను ప్రీ ప్లాన్డ్ గా ఎవరో ట్రాప్ చేశారని మిత్రులు అనుమానిస్తారు. స్టూడెంట్ అయిన గణేశ్ వేలు ఖర్చు పెట్టి ఐఫోన్ కొనడం ఏమిటీ? దాన్ని పోగొట్టుకోవడం ఏమిటీ? ఎవరిదో ఫోన్ అతనికిచ్చి కేసు క్లోజ్ చేస్తామని పోలీసులు చెప్పడం ఏమిటీ? దీని వెనుక ఉన్న మిస్టరీ ని తెలుసుకోవాలంటే మూవీని చూడాల్సిందే! అంతటి ఆసక్తిని ఈ టీజర్ కలిగిస్తోంది. ‘నాంది’తో కథాబలం ఉన్న సినిమాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సతీశ్ వర్మ ఇప్పుడూ అలాంటి కథనే ఎంచుకున్నాడని అర్థమౌతోంది. అలానే లవర్ బోయ్ ఇమేజ్ కోసం తాపత్రయపడకుండా, నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి బెల్లంకొండ గణేశ్ ప్రయత్నిస్తున్నాడనీ ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.
‘నేను స్టూడెంట్ సర్!’ టీజర్ ఆవిష్కరణ అనంతరం ముఖ్య అతిథి వినాయక్ మాట్లాడుతూ, ”సతీష్ గారు తీసిన ‘నాంది’ సినిమాను చూశాను. ఎక్కడా రాజీ పడకుండా మంచి కంటెంట్ తో దాన్ని నిర్మించారు. ఇప్పుడు అదే సంస్థలో గణేష్ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. టీజర్ చాలా బావుంది. ఈ సినిమాతో గణేష్ కి మరో విజయం రావాలని కోరుకుంటున్నాను. అవంతిక తన తల్లి భాగ్యశ్రీలానే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ, ”’స్వాతిముత్యం’ సినిమా విడుదల కాకముందే నన్ను నమ్మి ఇంత ఖర్చు చేసి ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాన్ని నిర్మించిన సతీష్ గారికి కృతజ్ఞతలు. కథని బలంగా నమ్మితేనే ఇలాంటి సినిమాలు చేయగలుగుతాం. కథలో విషయం వుంది కాబట్టే నేనూ యాక్సప్ట్ చేశాను. రాఖీ ఉప్పలపాటి లాంటి అంకిత భావంతో పని చేసే దర్శకుడు దొరకడం మా అదృష్టం. అవంతిక దస్సాని చాలా చక్కగా నటించింది. అసలు ఆమె తెలుగు అమ్మాయి కాదనే భావనే రాదు. ఇందులో రవి శివతేజతో నేను చేసే కామెడీ చాలా బాగా పండుతుందని నమ్ముతున్నాను” అని చెప్పారు. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉందని, టీజర్ ఎంత ఇంట్రస్టింగ్ గా ఉందో సినిమా కూడా అలానే ఉంటుందని నిర్మాత సతీశ్ వర్మ తెలిపారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య కథను సమకూర్చారని, కళ్యాణ్ చక్రవర్తి సంభాషణలు రాశారని, అందరి సహకారంతో అనుకున్న విధంగా ఈ సినిమాను తెరకెక్కించానని దర్శకుడు రాఖీ ఉప్పలపాటి తెలిపారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తన తల్లి భాగ్యశ్రీని దక్షిణాది చిత్రసీమ ఎంతో ప్రేమతో ఆదరించిందని, అదే ఆదరణ తనకూ లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నానని, ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని హీరోయిన్ అవంతిక దస్సాని చెప్పింది. జెమినీ సురేష్, రవి శివతేజ, శశి, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను సముతిర ఖని, సునీల్, ఆటో రాంప్రసాద్, చరణ్దీప్, ప్రమోదిని తదితరులు పోషించారు. మణిశర్మ తనయుడు మహతీ స్వర సాగర్ ఈ చిత్రానికి స్వర రచన చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..