బెల్లంకొండ గణేశ్ నటించిన రెండో సినిమా 'నేను స్టూడెంట్ సర్'! రాఖీ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'నాంది' సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాతో భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దుస్సాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ టీజర్ ను వివి వినాయక్ శనివారం విడుదల చేశారు.