NMBK Trailer: టాలీవుడ్ కుర్ర హీరో కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. ఈ చిత్రంలో కిరణ్ సరసన సంజనా ఆనంద్ మరియు సోనూ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా రోజుల తరువాత దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కిరణ్ అభిమానించే హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది.
“కొడుకు కంటే కూతురు పుడితేనే చాలా సంతోషంగా ఉంటామని నాలాంటి చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. ఎందుకంటే చివరి రోజుల్లో కొడుకు కన్నా కూతుర్లే బాగా చూసుకుంటారు అని.. అలాంటిది నువ్వు ఇలాంటి ఎదవని ప్రేమిస్తే ఎలా అమ్మా” అంటూ భావోద్వేగంతో ఎస్వీ కృష్ణా రెడ్డి చెప్పేడైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. ఇక క్యాబ్ డ్రైవర్ గా కిరణ్ కనిపించాడు.. తాగుబోతు హీరోయిన్ ను ప్రేమించిన అతడు.. ఆమెకు ఉన్న సమస్యల కోసం పోరాడుతున్నట్లు చూపించారు. మగతనం అంటే మాములుగా ఉన్న అమ్మాయితో మంచిగా ఉండడం కాదు.. తాగి ఉన్న అమ్మాయితో కూడా మిస్ బిహేవ్ చేయకుండా ఉండడం” అనే డైలాగ్ ఆకట్టుకొంటుంది. అసలు హీరోయిన్ కు వచ్చిన సమస్య ఏంటి.. కిరణ్ క్యాబ్ డ్రైవర్ గా ఎందుకు చేరాల్సివచ్చింది. హీరో ఎవరికి కావాల్సినవాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మాస్ లుక్ లో కిరణ్ అదరగొట్టాడు. మణిశర్మ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. టోటల్ గా ట్రైలర్ మాస్, క్లాస్ ఆడియెన్స్ కు నచ్చేలా ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.