బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ చాలామంది అభిమానులు జీర్ణించుకోలేనిది. డిప్రెషన్ కు గురై సుశాంత్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. దాదాపు రెండేళ్ల నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 34 మందిని విచారించిన ఎన్ సీబీ ఎట్టకేలకు సుశాంత్ మృతికి కారణం ఎవరో తేల్చి చెప్పేసింది. సుశాంత్ మృతికి కారణం ఖచ్చితంగా అతని ప్రేయసి రియా చక్రవర్తినే అని చెప్పుకొచ్చింది. ఆమె దగ్గర ఉండి అతడికి డ్రగ్స్ అలవాటు చేసినట్లు విచారణలో ఋజువు అయ్యినట్లు ఎన్ సీబీ రిపోర్ట్ లో తెలిపింది. తాజాగా నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) చార్జిషీట్ పై అధికారులకు అందించింది. అందులో ఏమున్నది అంటే.. సుశాంత్ కు డ్రగ్స్ తీసుకొనే అలవాటు లేదు.
రియా పరిచయం అయ్యాకనే అతడికి డ్రగ్స్ అలవాటు అయ్యాయి. ఆమెనే అతడికి డ్రగ్స్ అలవాటు చేసింది. ఈ డ్రగ్స్ సరఫరాలో రియా తో పాటు మరో 34 మంది ఉన్నారు. రియా ఎన్నో నెలలుగా చాలామంది స్టార్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నదని, ఈ మాఫియా లో రియా తమ్ముడు సివిక్ కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అక్కా తమ్ముళ్లు ఇద్దరు డ్రగ్స్ మాఫియాతో కుమ్మకై మార్చి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు బాలీవుడ్ లో డ్రగ్స్ పంపీణీ చేసినట్లు కూడా తెలిపారు. ఆ సమయంలోనే రియాకు, సుశాంత్ కు మధ్య ప్రేమాయణం నడవడం, ఆమె డ్రగ్స్ అలవాటు చేయడం వలనే సుశాంత్ డ్రగ్స్ తీసుకోవడం జరిగిందని, రియా వలనే సుశాంత్ మృతి చెందాడని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినా రియా ప్రస్తుతం బెయిల్ పై బయటకొచ్చిన విషయం విదితమే.. ఇక ఏఈ ఛార్జ్ షీట్ వలన ఆమెకు ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. ఇక రియానే తమా కొడుకును చంపేసిందని సుశాంత్ కుటుంబం చేసిన ఆరోపణలు ఈ ఛార్జ్ షీట్ తో నిజం అయ్యాయి. త్వరలోనే రియాను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. మరి ఈ కేసు నుంచి రియా తప్పించుకోనున్నదా..? లేక జైలుకు వెళ్లనున్నాదా..? అనేది తెలియాల్సి ఉంది.