NBK 112 : బాలయ్య – కొరటాల సినిమా ఓపెనింగ్‌కు అతిధులుగా ఇద్దరు మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో NBK112 రాబోతున్న సంగతి తెలిసిందే. SLV సినిమాస్, యువసుధా ఆర్ట్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మక నిర్మిస్తున్నాయి. ఈ సినిమా అధికారిక ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. చిత్ర పరిశ్రమలో ఎంతో క్రేజ్ ఉన్న ఈ పవర్ఫుల్ కాంబో సరికొత్త సంచలనాలకు శ్రీకారం చుడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది.
ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటాయపాలెంలో ఉన్న ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. దైవసన్నిధిలో ఏపీ రాజధాని నడిబొడ్డున ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన కీలక నేతలు కూడా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, బాలయ్య బాబు అల్లుడు నారా లోకేష్ తో పాటు ఏపీ సినిమాటోగ్రఫీ శ్రీ కందుల దుర్గేష్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రానున్నారు. “పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బెకమ్స్ ఎ మూవ్మెంట్” అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్‌తో మేకర్స్ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చేరుకూరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్, బాలయ్య రేంజ్ మాస్ ఎలివేషన్లతో రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..