Nayanthara: గత కొన్నిరోజులుగా కోలీవుడ్ తో పాటు అన్ని ఇన్ఫస్త్రీలను షేక్ చేసిన విషయం నయనతార- విగ్నేష్ శివన్ జంట సరోగసీ ద్వారా తల్లిదండ్రులు కావడం. వారు ఏ ముహూర్తాన తమ పిల్లలను ప్రపంచానికి పరిచయం చేసారో అప్పటినుంచి ఇండియాలో సరోగసీ బ్యాన్ చేశారు.. ఇల్లీగల్ గా నయన్ పిల్లలకు జన్మనిచ్చింది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ట్రోలర్స్, సినీ ప్రముఖులతో పాటు తమిళనాడు ప్రభుత్వం కూడా వారిని తప్పుపడుతూ పిల్లలకు ఎలా జన్మనిచ్చారో చెప్పాల్సిందిగా వివరణ కోరింది. ఇక అందుకు కొన్ని రోజులు టైమ్ కూడా ఇచ్చింది. ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది.
ఇక తాజాగా ఆరోగ్య శాఖ వీరి సరోగసీ కేసుపై నివేదికను ప్రభుత్వానికి అప్పజెప్పింది. ఈ జంట లీగల్ గానే సరోగసీ ప్రక్రియను పూర్తిచేసినట్లు చెప్పుకొచ్చారు. ఆరేళ్ళ క్రితమే అనగా 2016 లోనే నయన్- విగ్నేష్ పెళ్లి చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికెట్ ను ఆధారంగా చూపించారు. చెన్నైలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో సరోగసీ ప్రక్రియ జరిగిందని నిరూపించారు. ఇక దీంతో సరోగసీ చట్టబద్ధమే అని తమిళనాడు ప్రభుత్వం తేల్చిచెప్పింది. సరోగసీ విషయంలో నయన్- విగ్నేష్ ఎలాంటి నిబంధనలను ఉల్లఘించలేదని స్పష్టం చేసింది. ఇక దీంతో నయన్- విగ్నేష్ లకు ఈ కేసులో ఊరట లభించింది. ఇకనుంచి ఈ జంట తమ పిల్లలతో సంతోషంగా జీవించవచ్చు. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.