Nayan- Vignesh: లేడీ సూపర్ స్టార్ నయనతార- విగ్నేష్ శివన్ అభిమానులకు శుభవార్త చెప్పారు. తామిద్దరం కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యినట్లు చెప్పుకొచ్చారు. అదేంటి.. నాలుగు నెలలు కూడా కాకుండానే ఎలా అయ్యింది అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ జంట సరోగసీ ద్వారా కావాలా పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్నీ విగ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
” నయన్ మరియు నేను అమ్మ, అప్పగా మారాము. మాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. మేము ఆశీర్వదించబడ్డాము. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలు అన్ని మంచి అభివ్యక్తిలతో కలిపి మాకు 2 ఆశీర్వాద శిశువుల రూపంలో కలిసి వచ్చాయి. మా కోసం మీ అందరి ఆశీస్సులు కావాలి. ఉయిర్ అండ్ ఉలగమ్.. మీరు మా జీవితంలో ఎన్నో వెలుగులు నింపుతారని ఆశిస్తున్నాను. దేవుడు డబుల్ గ్రేట్” అని రాసుకొచ్చాడు. దీంతో షాక్ అయిన అభిమానులు కొద్దిగా తేరుకొని కంగ్రాట్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇటీవలే ప్రియాంక చోప్రా సరోగసీ ద్వారా తల్లి అయిన విషయం తెల్సిందే.