Chiranjeevi : చిరంజీవికి పోటీగా నవీన్ పోలిశెట్టి మారాడు. చిరుతో పోటీకి రిస్క్ చేస్తున్నాడా.. ఒకవేళ తేడా వస్తే ఎలా అనే చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీగా హైప్ పెంచేస్తున్నారు. పైగా 2026 సంక్రాంతికే తమ సినిమా ఉంటుందని ముందే ప్రకటించారు. అందరికంటే ముందే సంక్రాంతి డేట్ ను లాక్ చేసుకుంది ఈ సినిమానే. అనిల్ రావిపూడి సినిమాలన్నీ సంక్రాంతికే వచ్చి హిట్లు కొడుతున్నాయి. ఇప్పుడు మెగాస్టార్ మూవీని కూడా అదే సెంటిమెంట్ డేట్ కు తీసుకొస్తున్నారు. మరి అన్నీ తెలిసి కూడా నవీన్ పోలిశెట్టి తాను నటిస్తున్న అనగనగా ఒకరోజు.
Read Also : 96 Sequel : సేతుపతి అవుట్.. ప్రదీప్ ఇన్.. కానీ?
ఈ మూవీని మారి డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. మొన్నటి వరకు ఈ సినిమా గురించే పెద్దగా వినిపించలేదు. సైలెంట్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి వార్తల్లోకి వచ్చేసింది. మరి చిరంజీవి సినిమా ఉందని తెలిసి నవీన్ ఎందుకు రిస్క్ చేస్తున్నాడు అంటున్నారు కొందరు. ఇంకొందరేమో సినిమాలో కంటెంట్ బాగుంటే కచ్చితంగా ఆడుతుందంటున్నారు.
టాలీవుడ్ కు సంక్రాంతి అతిపెద్ద సీజన్. ఆ సీజన్ లో ఒకేసారి వచ్చిన రెండు, మూడు పెద్ద సినిమాలు కూడా భారీగా వసూళ్లను సాధించిన ఘటనలు చూశాం. అందుకే నవీన్ సినిమాకు వచ్చిన రిస్క్ ఏమీ లేదంటున్నారు. కానీ ఏ కొంచెం తేడా కొట్టినా నవీన్ పోలిశెట్టి మూవీ చిరు మూవీతో పోటీ పడలేక చతికలపడటం ఖాయం అంటున్నారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. అలాంటి చిరంజీవి సినిమాతో పోటీ పడి కలెక్షన్లు రాబట్టాలంటే నవీన్ సినిమా కచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకోవాల్సిందే. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Read Also : Formula E Scam Case: ఫార్మలా-ఈ రేసు కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు..