Koratala Shiva : మాసివ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా కొరటాల శివకు మంచి పేరుంది. ఆయన తీసే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో ఒక్క సినిమా తప్ప అన్నీ హిట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడున్న పాన్ ఇండియా సీజన్ లో.. ఒక సినిమా అయిపోక ముందే మరో హీరోతో సినిమాను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు డైరెక్టర్లు. కానీ దేవర సినిమా తర్వాత కొరటాల కనిపించకుండా పోయాడు. ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి సినిమా అనౌన్స్ కాలేదు. ఎన్టీఆర్ దేవర-2 ఉంటుందని ఫ్యాన్స్ ముందు హామీ ఇచ్చాడు.
Read Also : CM Revanth Reddy: కలెక్టర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్
కానీ ఆ మూవీ స్టార్ట్ కావడానికి ఎంత లేదన్నా ఇంకో రెండేళ్లు పడుతుంది. ప్రస్తుతం వార్-2, ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. మరి రెండేళ్ల దాకా ఎన్టీఆర్ కోసం కొరటాల ఆగుతాడా.. లేదంటే మరో హీరోను చూసుకుంటాడా అన్నది ఇంకా తేలలేదు. ప్రస్తుతం పెద్ద హీరోలు అందరూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అల్లు అర్జున్ అట్లీకి కమిట్ అయ్యాడు. మహేశ్ బాబు జక్కన్న చేతిలో ఉన్నాడు. రామ్ చరణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు కొరటాల.
పోనీ టైర్-2 హీరోలతో చేద్దాం అనుకుంటే.. నాని, విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్, రవితేజ లాంటి హీరోలు చేతిలో మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి కొరటాల దేవర-2 కోసం రెండేళ్లు వెయిట్ చేస్తాడా.. లేదంటే ఈ గ్యాప్ లో ఇంకే హీరోతో అయినా మూవీ చేస్తాడా అన్నది తేలాల్సి ఉంది. మొన్న దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లి వచ్చాడు. ఆ టైమ్ లోనే ఎన్టీఆర్ నుంచి హామీ తీసుకున్నట్టు తెలుస్తోంది.