The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!
The Paradise: నేచురల్ స్టార్ నాని – దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఒక పాటతో ఇండస్ట్రీని దుమ్మురేపి.. యావత్ సినీ లోకాన్ని ఈ సినిమా వైపు తిప్పుకున్న ప్యారడైజ్ గురించి తాజాగా మరొక సెన్సేషన్ వార్త వినిపిస్తుంది. గతంలో రిలీజ్ అయిన ‘ఆయా షేర్’ సాంగ్ ఎన్ని రికార్డులను నెలకొల్పిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం.. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ సినిమాలోని రెండో పాటను మే 10న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇది ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీ అని, నాని – హీరోయిన్ కయాదు లోహర్ మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్‌గా నిలవనుందని సమాచారం. ‘ఆయా షేర్’ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను ఊపేయగా, ఈ మెలోడీ సాంగ్ క్లాస్, యూత్‌ను ఆకట్టుకోనుందని టాక్.
ఆగస్టు 21న రిలీజ్..
నిజానికి ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని మేకర్స్ రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఈ చిత్రాన్ని ఆగస్టు 21, 2026న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
Also Read
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్‌లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో