Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్‌డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega 158 Update: వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుండటంతో దానిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం వర్కింగ్ టైటిల్ #Mega158 గా ప్రచారంలో ఉంది. తాజా ఈ సినిమాకు సంబంధించి లుక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు దర్శకుడు బాబీ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిపై లుక్ టెస్ట్ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను డైరెక్టర్ ఎక్స్‌లో షేర్ చేస్తూ, మెగాస్టార్ ‘స్వాగ్’ (Swag), స్టైల్‌ను సరికొత్తగా ఆవిష్కరించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిజానికి గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై వస్తున్న రకరకాల రూమర్స్‌కు ఈ అప్‌డేట్‌తో తెరపడినట్లు అయ్యింది. సినిమా పనులు పక్కా ప్లానింగ్‌తో ట్రాక్‌లో ఉన్నాయని ఒక్క ఫోటోతో టీమ్ స్పష్టం చేసింది.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మెగాస్టార్ పాత వింటేజ్ లుక్‌ను గుర్తు చేస్తూనే, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్‌ను ఈ సినిమాలో బాబీ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ జోడి, ఈసారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
Look test ☑️
Locked the look of #Mega158 with Megastar @KChiruTweets garu today 🤗
Can’t wait to begin this journey❤️🔥#ChiruBobby2 @KvnProductions @LohithNK01 pic.twitter.com/eWSLEqCqVN
— Bobby (@dirbobby) April 28, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!