ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలే నడుస్తున్న విషయం విదితమే. వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనవసరం లేదు. అయితే తాజాగా కొన్ని చిన్న సినిమాలు కూడా తమ సత్తా చాటుతున్నాయి. ఇక ఆ కోవకే చెందుతుంది ‘ముత్తయ్య’ చిత్రం. కె. సుధాకరరెడ్డి కీలక పాత్రలో నటించి భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ముత్తయ్య’. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగమ్‌శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను సమర్పిస్తుండగా, వ్రింద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇటీవలే యూకేలో జరగనున్న ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైంది . మే 9న ఈ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రిలీజ్ చేసిన విషయం విదితమే.
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని న్యాచురల్ స్టార్ నాని లాంచ్ చేయనున్నారు. ఏప్రిల్ 30 సాయంత్రం 4. 30 నిమిషాలకు ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఒక టీవీఎస్ బండిపై ఒక వృద్ధుడు కూర్చొని తన మనవడు వయసున్న కుర్రాడి తలలో ఏదో చూస్తున్నట్లు కనిపించాడు. ఇక ఆ కుర్రాడు చేతిలో ఫోన్ పట్టుకొని కూర్చోవడం ఆసక్తిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
The journey of #Muthayya just got bigger. We are thrilled that @nameisNani is going unveil the teaser on April 30 at 4:30 PM. Presented by #Vamsi #Kedar @HylifeE. Produced by @vrindaprasad @FictionaryEnt. Directed by #BhaskharMaurya. 🎥 #DivakarMani. #DreamBig #MuthayyaTeaser pic.twitter.com/g2ziqFCB0e
— Fictionary Entertainment (@FictionaryEnt) April 29, 2022