ముత్తయ్య త్వరలో ఈటీవీ విన్‌లో ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. సినిమాల్లో నటించాలనే కలతో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడి కథను ఈ చిత్రం హృదయస్పర్శిగా తెరపై ఆవిష్కరించింది. తన కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో అనేక అడ్డంకులను అధిగమించిన అతని ప్రయాణం అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ మౌర్య తెరకెక్కించారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.…
అష్టాచమ్మా చిత్రంతో తెలుగుతెరకు నాని గా పరిచయమయ్యాడు నవీన్ బాబు ఘంటా. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి, అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి, అనుకోని ఒక పరిస్థితిలో నవీన్ నుంచి నాని గా మారాడు. ఇక తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆనతి కాలంలోనే న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పటికి నాని చాలా సార్లు ఈ విషయాన్ని చెప్తూనే ఉంటాడు. అష్టాచమ్మా కనుక జరగకపోయి ఉంటే తాను ఇప్పుడు, ఇక్కడ, ఇలా ఉండేవాడిని కాదు అని,…
ఇటీవలే యూకేలో జరగనున్న ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైన చిన్న చిత్రం ‘ముత్తయ్య’. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. సుధాకరరెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడుదల చేసిన విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. టీజర్ ఆద్యంతం మనస్సును హత్తుకుంటుంది. ఇక టీజర్…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలే నడుస్తున్న విషయం విదితమే. వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనవసరం లేదు. అయితే తాజాగా కొన్ని చిన్న సినిమాలు కూడా తమ సత్తా చాటుతున్నాయి. ఇక ఆ కోవకే చెందుతుంది ‘ముత్తయ్య’ చిత్రం. కె. సుధాకరరెడ్డి కీలక పాత్రలో నటించి భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ముత్తయ్య’. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగమ్‌శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను సమర్పిస్తుండగా, వ్రింద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ…