యాంకర్ సుమ ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం విదితమే. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మే 6 న రిలీజ్ కాబోతుండడంతో మేకర్స్ నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ వేదికపై నాని మాట్లాడుతూ.. ” అందరికి నమస్కారం.. ‘దేవదాసు’ తరువాత నాగార్జున సర్ ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి సుమ.. క్యాస్టింగ్ ప్లేస్ లో నేను గెస్ట్ ప్లేస్ లో ఉండడం కొత్తగా అనిపిస్తుంది. నిజం చెప్తున్నా ఈరోజు నా సొంత ప్రోగ్రాం ఉన్నా కానీ దాన్ని వాయిదా వేసుకొని మరి ఈ ఫంక్షన్ ని వచ్చేవాడిని. ఇప్పటివరకు సుమ గారు, మీరు..మీరు.. సుమగారు ఇలా పీల్చి అలవాటైపోయింది.. ఈ ఫార్మాలిటీస్ అన్ని పట్టించుకోకుండా నా మనసుకు ఏది అనిపిస్తే అది అనాలంటే ఆ పిలుపు సుమక్క అవుతుంది.
నేను ఎప్పుడు అదే చెప్తున్నాను..ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూ లో చెప్పాను .. నేను సుమగారికి చాలా పెద్ద అభిమానిని. ఇండస్ట్రీలో పెద్దలు,అసోసియేషన్ లు, గవర్నమెంట్ లు సినిమాకు ఏమి చేశాయో నాకు తెలియదు కానీ, సుమగారు చాలా చేశారు తెలుగు సినిమాకు. నాకు తెలిసి మేమందరం ఎప్పటికి రుణపడిపోయి ఉంటాం. ప్రతి సినిమా రిలీజ్ ముందు సుమగారు అనే ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆ నవ్వులో ఉండే పాజిటివ్ ఎనర్జీ.. మా ప్రతి ప్రాజెక్ట్ కి ఆవిడ తీసుకొచ్చే పాజిటివ్ ఎనర్జీ మాకెంతో అవసరం. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను . ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకొని మళ్లీ సుమగారు మా ఫంక్షన్ లో ఎక్కడ దొరక్కూడదు అని కోరుకుంటున్నాను. చాలా కష్టమైన పని.. కానీ సుమగారు వెండితెరపై ఎక్కువ సమయం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని చెప్పుకొచ్చారు.