Taraka Rathna: సినిమా రంగంలోకి నందమూరి తారకరత్న ఎంట్రీనే ఓ రికార్డ్! నందమూరి తారకరామారావు మనవడైన తారకరత్న కూడా తనను తాను షార్ట్ కట్ లో ఎన్టీఆర్ గా చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటాడు. తారకరత్న ఎంట్రీ అయితే ధూమ్ ధామ్ గా జరిగింది కానీ… ఆ తర్వాత సినీ ప్రయాణమే అనేక ఒడిదుడుకులకు లోనైంది. చిత్రం ఏమంటే… హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నందమూరి వారసుడు విలన్ గా నంది అవార్డు అందుకున్నాడు. అప్పటి నుండి వైవిధ్యమైన కథా చిత్రాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఆ మధ్య తారకరత్న నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సారధి’ విడుదలైంది. ఇప్పుడీ యేడాది చివరిలో అతని మరో సినిమా ‘ఎస్ -5’ విడుదల కాబోతోంది. ‘నో ఎగ్జిట్’ అనేది దీని ట్యాగ్ లైన్. ఇందులో తారకరత్న ఓ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ సన్నీ కొమలపాటి దర్శకత్వంలో గౌతమ్ కొండేపూడి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. సన్నీ సైతం ఇందులో ఓ కీ-రోల్ ప్లే చేశాడు. ఈ పొలిటికల్ హారర్ డ్రామాను డిసెంబర్ 30న జనం ముందుకు తీసుకురాబోతున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ‘ఎస్ -5’ మూవీలో సాయికుమార్, ప్రిన్స్, అవంతిక, సునీల్, అలీ, ఫిష్ వెంకట్ తదితరలు కీలక పాత్రలు పోషించారు.