Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ చాలా గ్యాప్ తరువాత నటిస్తునం చిత్రం బింబిసార. నూతన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో కాలేయం రామ్ సరసన క్యాథరిన్, సంయుక్త మీనన్, వరీనా హుస్సేన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో కళ్యాణ్ రామ్ ప్రమోషన్ల జోరును పెంచేశాడు. వరుస ఇంటర్వ్యూలను ఇస్తూ సినిమా గురించి ఆసక్తికర విశేషాలను పంచుకుంటున్నాడు.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్, ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా కథ మొదటిసారి విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది..? రాజుగా అన్నప్పుడు మీరేమి అనుకున్నారు..? అన్న ప్రశ్నకు కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ “బింబిసార రాజు కథ అని చెప్పగానే.. ఏంటీ ఈయన రాజు అంటున్నాడు.. మనం సెట్ అవుతామా.. ఆయన బాహుబలి తీశారు.. ప్రభాస్ ఏమో ఆరడుగులు ఉంటాడు. రాజు అంటే ప్రభాస్.. ఇప్పుడున్న జనరేషన్ కు రాజు అంటే ప్రభాసే. అలా చూపించేశారు. అలాంటిది రాజు ప్లేస్ లో నేను ఎక్కడ సెట్ అవుతాను.. రిస్క్ అవుతుందా..? అని చాలా భయపడ్డాను..” అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ గురించి కళ్యాణ్ రామ్ చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి రాజుగా కళ్యాణ్ రామ్ ఎలా మెప్పిస్తాడా చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.