జనవరి 12న వీరసింహా రెడ్డి ఆగమనం ఏ రేంజులో ఉండబోతుందో అందరికీ చిన్న సాంపిల్ లా చూపించబోయే ట్రైలర్ బయటకి వచ్చే సమయం ఆసన్నం అయ్యింది. ఈరోజు ఒంగోల్ లో జరగనున్న ప్రీ ఈవెంట్ లో వీర సింహా రెడ్డి ట్రైలర్ ని లాంచ్ చెయ్యనున్నారు. సాయంత్రం 8:17 నిమిషాలకి బాలయ్య ఉగ్రనరసింహుడి రూపంలో యుట్యూబ్ ని షేక్ చెయ్యనున్నాడు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా బాలయ్య బ్లాక్ షర్ట్ వేసి పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య కనిపించలేదు, ఆ స్టైలిష్ ఎట్ మాస్ లుక్ ని బాలయ్యకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా చూసుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.
ఈరోజు సాయంత్రం బయటకి రానున్న ట్రైలర్ తో వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ తారాస్థాయికి చేరుకోనున్నాయి. ఈ ట్రైలర్ తో బాలయ్య ఈ సంక్రాంతి నాదే అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకూ ఉన్న హైప్ మరింత పెరగాలి అన్నా, జనవరి 12న ఓపెనింగ్స్ అదిరిపోవాలి అన్నా ట్రైలర్ విజిల్స్ వేయించే రేంజులో ఉండాలి. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి, ఒక మూడు డైలాగులు పూనకలు తెచ్చే రేంజులో వినిపిస్తే చాలు వీర సింహా రెడ్డి ట్రైలర్ చేసే సౌండ్ గట్టిగానే వినిపిస్తుంది. బాలయ్యకి డై హార్డ్ ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’ లాంటి వింటేజ్ బాలయ్య సినిమాలని చూసే ఉంటాడు కాబట్టి నందమూరి హీరోని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో తను అలానే చూపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలయ్యని బోయపాటి మాత్రమే హ్యాండిల్ చెయ్యగలడు, బోయపాటి మాత్రమే సాలిడ్ హిట్ ఇవ్వగలడు అనే మాటకి ఎండ్ కార్డ్ పడాలి అనే గోపీచంద్ మలినేని బాలయ్యకి వీర సింహా రెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టాల్సిందే.