Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఇల్లు ఎక్కడ అంటే.. హైదరాబాద్ లో తిరిగే వారెవరైనా టక్కున చెప్పేస్తారు జూబ్లీ హిల్స్ రాడ్ నెం 45 అని. అంత ఫేమస్ ఆ ఇల్లు. నిత్యం వాహనదారులతో రద్దీగా ఉండే ఆ ఇల్లు గురించి సంచలన ఆరోపణలు చేశాడు ఒక వ్యక్తి. ఆ ఇంటి ముందు ఉన్న స్థలాన్ని బాలయ్య కబ్జా చేసినట్లు చెప్పుకొస్తూ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఆ ట్వీట్ చేసింది ఎవరో కాదు.. గతంలో బుక్ మై షో.. పేటీఎం లాంటి సంస్థలు చేసే తప్పుల్ని ఎత్తి చూపి తన కోర్టు ఖర్చులను సైతం అణా పైసలతో రాబట్టిన విజయ గోపాల్. ఇక ఆయన ట్వీట్ చేస్తూ బాలయ్య ఇంటి ముందు ఉన్నపేవ్ మెంట్ సర్కారు స్థలమని, దాన్ని బాలయ్య అక్రమంగా కబ్జా చేసారని చెప్పుకొచ్చాడు.
“ఇప్పటికి నాకు అర్ధం కాలేదు.. బాలకృష్ణ ఇంటి ఎదురు అంత పేవ్ మెంట్ ను కబ్జా చేసి పచ్చని మొక్కలు పెంచుతుంటే జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తోంది.. ఇలాంటి పని ఒక సామాన్యుడు చేస్తే ప్రభుత్వం ఉరుకొంటుందా” అని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒకప్పుడు ఆ స్థలంలో ఎక్కువ వాహనాలు నడిచేవి కావు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ట్రాఫిక్ ఎక్కువ అయ్యింది. రోడ్డు మీదకు బాలయ్య పేవ్ మెంట్ రావడంతో అది ఇంకా ఇబ్బందిగా మారింది. దాని గురించి ఎవరు పట్టించుకున్నది లేదు. అసలు ఆ స్థలం ప్రబ్యత్వంది అని తెలిసినవారు కూడా లేరు.. ఇప్పుడు ఈ విషయాన్ని విజయ గోపాల్ చెప్పడంతో ప్రతి ఒక్కరు అదేంటి అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నేతలు అయితే ఇలాంటివి మాట్లాడరు ఎవరు..? ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయమై బాలయ్య ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
Yesterday I couldn't help but realise how this @NBK house has clearly encroached the pavement completely infront of his house, putting generator, greenery n all, while people walking on roads. Right after the house, the pavement is fine. Why ?! @GHMCOnline @ZC_Khairatabad (1/2) pic.twitter.com/0SxxSWec6c
— Vijay Gopal (@VijayGopal_) October 8, 2022