నటసింహం నందమూరి బాలకృష్ణ తన ట్రేడ్ మార్క్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘జై బాలయ్య’ అంటూ సాగిన ఈ మొదటి పాట ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని రిలీజ్ డేట్ కోసం బాలయ్య అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. నందమూరి అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ, మైత్రి మూవీ మేకర్స్ జనవరి 12న ‘వీర సింహా రెడ్డి’ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు కాబట్టి ఇక్కడి నుంచి థియేటర్స్ లోకి ‘వీర సింహా రెడ్డి’ సినిమా వచ్చే వరకూ పర్ఫెక్ట్ గా ప్రమోషన్స్ చేసుకుంటే చాలు, బాలయ్య హిట్ కొట్టేసినట్లే.
Also Read : Disha Patani: కోల్డ్ క్లైమేట్ లో హాట్ ఫోటోస్…
సంక్రాంతి సీజన్ లో బాలయ్య సినిమాని చూడడానికి నందమూరి అభిమానులు రెడీ అవుతుంటే, చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూడడానికి మెగా అభిమానులు సిద్ధమవుతున్నారు. మాస్ అవతారంలోకి మారి చిరు చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. దీంతో సంక్రాంతి సీజన్ లో చిరు, బాలయ్యల పోటికి రంగం సిద్ధమయ్యింది. అయితే ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది కానీ ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ పై ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు ఒక రోజు గ్యాప్ తోనే ఈ రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మరి సంక్రాంతి పండగని చిరంజీవి, బాలకృష్ణలు తమ బాక్సాఫీస్ వార్ తో ఇంకెంత ఇంటరెస్టింగ్ గా మారుస్తారో చూడాలి.