యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైఖేల్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ పై సందీప్ కిషన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ బజ్ క్రియేట్ చెయ్యడమే కాకుండా మైఖేల్ సినిమాపై అంచనాలని కూడా పెంచింది. ఈ టీజర్ ని కలర్ టోన్ నుంచి యాక్షన్ ఎపిసోడ్స్ వరకూ ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాకి ఉండాల్సిన యూనివర్సల్ కంటెంట్ తోనే మైఖేల్ సినిమా రూపొందింది అనే నమ్మకం టీజర్ తోనే కలిగించారు మేకర్స్.
“మైఖేల్.. వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి”, “మైఖేల్.. మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం..” అని అయ్యప్ప శర్మ వాయిస్ ఓవర్ తో అంటుండగా.. “నేను మనిషిగానే ఉంటాను మాస్టర్.. దేవుడు అవ్వాలనే ఆశ లేదు” లాంటి డైలాగ్స్ టీజర్ లో బాగా పేలాయి. ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ఇటివలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న మైఖేల్ మూవీ ట్రైలర్ ని 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. నట సింహం నందమూరి బాలకృష్ణ ‘మైఖేల్’ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చెయ్యబోతున్నాడు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ” #Michael Theatrical Trialer on Monday (January 23rd) with the Blessings of BalaKrishna Garu” అంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. టీజర్ తో క్రియేట్ చేసిన పాజిటివ్ వైబ్ ని ట్రైలర్ తో మరింత పెంచి, మైఖేల్ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చెయ్యాలి అనేది మేకర్స్ ప్లాన్. ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగలిగితే ఫిబ్రవరి 3న థియేటర్స్ లోకి రానున్న మైఖేల్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ మూవీతో సందీప్ కిషన్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
#Michael Theatrical Trialer on Monday (January 23rd)
with the
Blessings of BalaKrishna Garu ♥️#Telugu #MichaelOnFeb3rd pic.twitter.com/QwgStFbiOq— Sundeep MICHAEL-Feb 3rd Kishan (@sundeepkishan) January 21, 2023