Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నేలకొండ భగవంత్ కేసరిగా బాలయ్య కనిపిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుక గా రిలీజ్ కానుంది. ఇకపోతే తాజాగా ఈ సెట్ నుంచి కొన్ని ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. నేడు షూటింగ్ బాలయ్య- కమెడియన్ సప్తగిరి మధ్య సన్నివేశాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ మొదలుకాకముందే కార్ వ్యాన్ లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలయ్య భగవంత్ కేసరి గెటప్ లో ఉండగా.. సప్తగిరి నార్మల్ గెటప్ లోనే కనిపిస్తున్నాడు. ఇక ఒకరికొకరు జోకులు చెప్పుకొని నవ్వుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఒకరి గడ్డం ఒకరు పట్టుకొని నవ్వుతున్న ఫోటో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Jeniffer Piccinato: రామసేతు పాప.. బికినీ అవతారం.. మరీ ఇంత ఘూటుగానా
ఇక కమెడియన్ సప్తగిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే ఆయన టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం చేయమన్నా చేస్తాను అని తెలిపాడు. రాజకీయపరంగా కాకుండా సినిమాలపరంగా కూడా సప్తగిరికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఈ చిత్రంలో బాలయ్య పక్కన ఒక మంచి క్యారెక్టర్ పడి అది క్లిక్ అయితే ఈ కమెడియన్ పంట పండినట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఎలాగూ అనిల్ రావిపూడి కామెడీ పంచ్ లు ఎలా ఉంటాయో అందరికి తెల్సిందే. ఇక వీరి మధ్య ఏ రేంజ్ లో కామెడీని పండించనున్నాడో చూడాలి.