పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు చాలానే సమయం ఉన్నప్పటికీ ప్రభాస్ అభిమానులు అసలు ఏమాత్రం ఓపిక పట్టట్లేదు. అప్డేట్స్ కోసం మేకర్స్ ను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. వారి ఆతృత చూసిన మేకర్స్ సైతం సినిమా ప్రమోషన్స్ కు త్వరగానే శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఒక సాంగ్ విడుదల చేసిన ‘రాధేశ్యామ్’ మేకర్స్ ఇటీవల రెండవ సాంగ్ తో తెలుగుతో పాటు హిందీలో సైతం మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. నిన్న ‘ఆషి కీ ఆగయి” అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసిన చిత్రబృందం నేడు తెలుగు ప్రేక్షకులతో పాటు మిగతా భాషల అభిమానుల కోసం అన్ని సౌత్ లాంగ్వేజెస్లో “నగుమోము తారలే” వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాన్స్, డైలాగ్స్ తో పాటు సిద్ శ్రీరామ్ వాయిస్ మ్యాజిక్ మైమరిపిస్తోంది.
Read Also : డల్లాస్ లో ‘అఖండ’ మాస్ జాతర… వీడియో వైరల్
మనసుకు హత్తుకునే విధంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ముఖ్యంగా సాంగ్ మొదట్లో పూజ “నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా ?” అని ప్రశ్నించగా, “ఛ నేను ఆ టైప్ కాదు” అని ప్రభాస్ చెప్పడం, “కానీ నేను ఆ టైపే.. నాతో ప్రేమలో పడితే చావు తప్పదు” అని హెచ్చరించడం, “ఐ జస్ట్ వాంట్ ఫ్లర్టేషన్ షిప్” అంటూ ప్రభాస్ చెప్పడం ఆకట్టుకుంటోంది. ఈ పాటను తెలుగు, తమి భాషల్లో సిద్ శ్రీరామ్ పాడగా, కన్నడ, మలయాళ వెర్షన్లలో సౌరాజ్ సంతోష్ పాడారు. హిందీ వెర్షన్ సాంగ్ ను ఆర్జిత్ సింగ్ ఆలపించారు.
Read Also : వరద బాధితులకు అల్లు అర్జున్ భారీ విరాళం
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన “రాధే శ్యామ్” 1980ల నాటి పారిస్ నేపథ్యంలో వస్తున్న ప్రేమకథ. జ్యోతిష్యుడి పాత్రలో విక్రమ్ ఆదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే నటించారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, సాషా చత్రి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. “రాధే శ్యామ్” 2022 జనవరి 14న చైనీస్, జపనీస్ భాషలతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.