Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ కుర్ర హీరో నుంచి వస్తున్న చిత్రం రంగబలి. పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటుంది. అయితే.. ఈ మధ్య నాగశౌర్య ఒక చిన్న వివాదంలో ఇరుక్కున్నాడు. దాన్ని వివాదం అని అనలేం కానీ, ఒక చిన్న గొడవ. రోడ్డు మీద ఇద్దరు ప్రేమికులు కొట్టుకుంటుంటే.. శౌర్య వెళ్లి ఆపాడు. కూకట్ పల్లి రోడ్డులో శౌర్య కారులో వెళ్తుంటే .. రోడ్డు మీద ఒక అమ్మాయిని ఆమె ప్రియుడు కొడుతూ కనిపించాడు. అది చూసిన శౌర్య అతనిని ఆపి.. అలా కొట్టొద్దు అని ఆపగా.. తిరిగి శౌర్య మీదనే ఆ అమ్మాయి ఫైర్ అయ్యింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే అప్పుడు ఇదంతా ప్రమోషన్ వీడియో అని కూడా అన్నారు. తాజాగా రంగబలి ప్రమోషన్స్ లో ఈ సంఘటన గురించి శౌర్య క్లారిటీ ఇచ్చాడు.
Dil Raju: వారసుడు కోసం దిల్ రాజు భారీ ప్లాన్ వేశాడే.. ?
” ఆ గొడవలో తప్పంతా ఆ అమ్మాయిదే. పనిమీద కూకట్ పల్లి వెళ్తుండగా ఓ అబ్బాయి అమ్మాయిని కొడుతూ కనిపించాడు. వెంటనే అక్కడికి వెళ్లి ఎందుకు శ్రీ అమ్మాయిని కొడుతున్నావ్ సారి చెప్పు అని అడిగాను.. కానీ అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ నన్ను కొడుతాడు.. చంపుతాడు నీకెందుకు అంది. అమ్మాయిలే అలా అంటే ఇంకేం చెప్తాము. కానీ నేను ఒక్కటే చెప్తా అలా మిమ్మల్ని కొట్టేవాడిని అస్సలు పెళ్లి చేసుకోవద్దు.. దాని వల్ల మీకు, మీకుటుంబంకు మంచిది కాదు. మీ జీవితంలో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అనే విషయాన్ని అమ్మాయిలు ఆలోచించుకోవాలి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శౌర్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.