Bigg Boss 9 : తెలుగు నాట భారీ క్రేజ్ ఉన్న బిగ్ బాస్ షో మళ్లీ స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే 8 సీజన్లు కంప్లీట్ అవగా.. 9వ సీజన్ కోసం అంతా రెడీ అవుతోంది. ఈ మధ్య పెద్దగా క్రేజ్ రాకపోవడంతో ఈ సారి సామాన్యులకే పెద్ద పీట అనే కాన్సెప్టుతో వస్తున్నారు. ఈ సీజన్ లో ముగ్గురు కామన్ పర్సన్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీని కోసం ఆగస్టు 22 నుంచి అగ్నిపరీక్ష పేరుతో కాన్సెప్టు నిర్వహిస్తున్నారు. ఇందులో సెలెక్ట్ అయిన వారిలో ముగ్గురిని తీసుకుంటారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నాడు. గత సీజన్ కు రూ.15 కోట్ల దాకా తీసుకున్న నాగ్.. ఈ సారి భారీగా డిమాండ్ చేస్తున్నాడంట.
Read Also : Prabhas : ప్రభాస్ కు ఇష్టమైన పాట అదే.. ఐకానిక్ సాంగ్ రా బాబు..
రూ.25 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు నాగార్జున సినిమాలకు కూడా ఈ స్థాయిలో తీసుకోలేదు. కానీ బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇంత తీసుకుంటున్నాడంట. ఈ సారి కొంచెం ఫేమ్ ఉన్న సెలబ్రిటీలనే తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతానికి కమెడియన్ ఇమ్మాన్యుయేల్, చిట్టి పికిల్స్ రమ్య మోక్ష, సోషల్ మీడియా ద్వారా ఫేమ్ తెచ్చుకున్న వాళ్లతో పాటు సీరియల్ బ్యాచ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు జబర్దస్త్ కమెడియన్ల పేర్లు వినిపిస్తున్నా.. ఫైనల్ లిస్ట్ వచ్చాకే క్లారిటీ రాబోతోంది.
Read Also : WAR 2 Pre Release Event : ఇండియాలో గ్రేట్ డ్యాన్సర్ అతనే.. ఎన్టీఆర్ కితాబు