Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా సీక్రెట్ గా మెయింటేన్ చేస్తుంటాడు. అందరు హీరోల్లాగా బయట పెద్దగా కనిపించడు. తన గురించి ఏదీ బయటకు తెలియనీయడు. ఇంకో విషయం ఏంటంటే ఏ అవార్డుల ఫంక్షన్లకు రాడు. తనకే అవార్డు వచ్చినా అక్కడ కనిపించడు. ఇక మామూలు ప్రోగ్రామ్స్ కు అయితే అసలే రాడు. అలాంటి ప్రభాస్ తన ఇష్టాలను చాలా రేర్ గా బయట పెడుతుంటాడు. ఆయన తనకు ఇష్టమైన పాట గురించి ఓ సారి స్పెషల్ గా చెప్పాడు. ఆ సాంగ్ కు చాలా ప్రత్యేకత ఉంది. పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ జల్సా.
Read Also : War 2 Pre Release Event : వార్-2 పక్కా తెలుగు సినిమానే.. డబ్బింగ్ కాదు : నాగవంశీ
ఈ సినిమాలోని ”ఛలోరే ఛలోరే ఛల్” సాంగ్ చాలా ఫేమస్. ఈ పాట అంటే తనకు చాలా ఇష్టం అని.. ఎన్నోసార్లు విన్నానని చెప్పాడు ప్రభాస్. తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు స్పెషల్ గా ఈ పాట పెట్టి వినిపిస్తుంటానని.. వారు తనను వద్దు చాలు అంటారని తెలిపాడు ప్రభాస్. అంతగా ఆ పాట తనకు నచ్చిందన్నాడు. ఈ పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఇందులో నేటి మనుషుల తీరును చాలా క్లుప్తంగా సెటైరికల్ గా వివరించారు ఆయన. దీన్ని నేటి తరానికి ఎక్కేలా మ్యూజిక్ అందించాడు దేవి శ్రీ ప్రసాద్. ఆయన మ్యూజిక్ అందించిన ఈ పాట అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పటికీ ఇది టీవీల్లో వస్తే అలా చూస్తుండిపోతారు. ఈ పాటలో పవన్ కల్యాణ్ అడవిలో ప్రకాశ్ రాజ్ ను తన గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించే క్రమంలో వస్తుంది.
War 2 Pre Release Event : నన్ను ఎవ్వరూ ఆపలేరు.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్