8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo Find X10 Series: ఒప్పో నుండి నెక్స్ట్ జెనరేషన్ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ Find X10 సిరీస్‌కు సంబంధించిన వివరాలు లీక్ అవుతున్నాయి. రాబోయే ఈ లైనప్ లో Find X10, Find X10 Pro, Find X10 Pro Max అనే మూడు మోడళ్లు ఉండబోతున్నట్లు సమాచారం. తాజా లీక్స్ ప్రకారం స్టాండర్డ్ Find X10 మోడల్‌లో కొన్ని ఆసక్తికరమైన అప్‌గ్రేడ్స్ లీక్ అయ్యాయి. అందిన వివరాల ప్రకారం, Oppo Find X10లో 6.59 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో వస్తుందని, స్క్రీన్ విషయంలో ఫ్లాట్ డిజైన్‌ను కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.
Also Read
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
రాబోయే ఈ కొత్త సిరీస్ లో కెమెరా విభాగంలో కూడా భారీ మార్పులు ఉండనున్నాయి. ఈ ఫోన్ లో డ్యూయల్ 200MP రియర్ కెమెరా సెటప్ ఇవ్వనున్నట్లు సమాచారం. అంటే ఫోటోగ్రఫీ విషయంలో ఈ సిరీస్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఇదే తరహా హై-రిజల్యూషన్ కెమెరాలను మొత్తం Find X10 సిరీస్‌లో కూడా ఉండబోతునట్లు సమాచారం. బ్యాటరీ విషయంలో ఈ ఫోన్ భారీ అప్‌గ్రేడ్ తీసుక రానుంది. Oppo Find X10లో 8000mAh సామర్థ్యం గల బ్యాటరీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న Find X9లో 7025mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కొత్త మోడల్‌లో మరింత పెద్ద బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మెరుగుపడే అవకాశం ఉంది.
ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఈ సిరీస్‌లో ఇంకా ప్రకటించని 2nm MediaTek Dimensity 9600 చిప్‌సెట్ ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇది గత సంవత్సరం వచ్చిన Find X9 సిరీస్ లోని 3nm Dimensity 9500 కంటే మంచి అప్‌గ్రేడ్ అవుతుంది. దీంతో పనితీరు, పవర్ ఎఫిషెన్సీ రెండూ మెరుగవుతాయని అంచనా. ర్యామ్, స్టోరేజ్ విషయంలో LPDDR6 RAM, UFS 5.0 స్టోరేజ్ ఇవ్వవచ్చని గతంలో వార్తలు వచ్చినప్పటికీ, ఇది ఖర్చు పరంగా సవాల్‌గా మారవచ్చని టిప్‌స్టర్ సూచించాడు. ప్రస్తుతం Find X9 సిరీస్‌లో LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ ఉపయోగిస్తున్నారు.
అలాగే Find X10 మోడళ్లలో బిల్ట్-ఇన్ మ్యాగ్నెట్స్ ఉండే అవకాశం ఉంది. దీంతో వైర్‌లెస్ ఛార్జింగ్ యాక్సెసరీలు, ఫోన్ స్టాండ్స్‌కు సులభంగా అత్తుకునేలా డిజైన్ చేయవచ్చు. ఇక Find X10 Pro మోడల్‌లో కూడా డ్యూయల్ 200MP కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 1/1.3 అంగుళాల సెన్సర్‌తో ప్రధాన కెమెరా, అలాగే అదే సైజ్‌తో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. వీటితోపాటు సెల్ఫీ కెమెరా కోసం 1:1 స్క్వేర్ సెన్సర్ ను ఒప్పో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది యాపిల్ ఫోన్లలో ఉన్న “సెంట్రీ స్టేజి” టెక్నాలజీని తలపిస్తుంది.
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?