Uppal Metro: ఐపీఎల్ మ్యాచ్ వేళ భాగ్యనగరంలో హై టెన్షన్.. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు..
- ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు ఉందంటూ కాల్స్..
- తనిఖీలు చేసిన అధికారులు..
- బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరంలోని ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో శుక్రవారం ఒక్కసారిగా కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బాంబు బెదిరింపు కాల్‌తో ప్రయాణికులు, మెట్రో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శనివారం (ఏప్రిల్ 18) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలకమైన ఐపీఎల్ 2026 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే?
శుక్రవారం ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, స్టేషన్ ఆవరణలో బాంబు పెట్టినట్లు హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన మెట్రో అధికారులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఈ వార్త స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులకు తెలియడంతో వారంతా భయంతో పరుగులు తీశారు. దీంతో కాసేపు స్టేషన్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Also Read:Simple Ultra: ఏథర్, ఒలాకు గట్టి సవాల్.. సింపుల్ అల్ట్రా 400KM రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్
పోలీసుల మెరుపు తనిఖీలు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. మెట్రో స్టేషన్‌లోని రెండు ప్లాట్‌ఫారమ్‌లు, పార్కింగ్ ఏరియా.. అనుమానం వచ్చిన ప్రతి మూలను అధికారులు జల్లెడ పట్టారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం స్టేషన్‌లో ఎటువంటి బాంబు లేదని పోలీసులు నిర్ధారించారు. అది కేవలం ఒక ‘హోక్స్ కాల్’ (నకిలీ బెదిరింపు) అని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఐపీఎల్ మ్యాచ్‌పై ప్రభావం..?
రేపు (శనివారం) సాయంత్రం 7:30 గంటలకు SRH vs CSK మ్యాచ్ జరగనుంది. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ సమయాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ వేలాదిమంది అభిమానులతో కిక్కిరిసిపోతుంది. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు కాల్ డేటా ఆధారంగా విచారణ చేపడుతున్నారు. ఇలాంటి ఆకతాయి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం మెట్రో సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులు, క్రికెట్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!