T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!
- 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్..
- అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) దర్యాప్తు
- కెనడా క్రికెట్ బోర్డుపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026 Fixing: టీ20 వరల్డ్ కప్ 2026ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ కప్ సంబంధించి ఓ సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. టోర్నమెంట్‌లో జరిగిన ఓ మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ (అవినీతి) జరిగిందనే అనుమానాలతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) దర్యాప్తు ప్రారంభించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ 2026ను నిర్వహించగా, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఫైనల్లో ఓడిపోయినా.. గ్రూప్ స్టేజ్, సూపర్-8 దశల్లో అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
swayambhu : నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్వయంభు’ ఫస్ట్ సాంగ్ ఆదరిందిగా
అయితే ఆ టోర్నమెంట్ లో న్యూజిలాండ్ ఆడిన ఒక గ్రూప్ మ్యాచ్ పై ఐసీసీ ఇప్పుడు దృష్టి పడింది. కెనడా జట్టు పాల్గొన్న ఈ మ్యాచ్ లో అనుమానాస్పద చర్యలు చోటుచేసుకున్నట్లు ACU భావిస్తోంది. ముఖ్యంగా కెనడా కెప్టెన్ దిల్ ప్రీత్ బాజ్వా ఆడిన తీరు అనేక సందేహాలకు తావిచ్చింది. గ్రూప్-D లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్, యూఏఈ జట్లతో కలిసి ఉన్న కెనడా, న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి 173 పరుగుల స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్ ఓ ఓపెనర్ యువరాజ్ సమ్రా అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు.
కానీ లక్ష్య చేధనలో న్యూజిలాండ్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా, కెనడా జట్టు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయింది. ఆ సమయంలోనే కెప్టెన్ దిల్ ప్రీత్ బాజ్వా నిర్ణయం అనుమానాస్పదంగా మారింది. సాధారణంగా బౌలింగ్ చేయని అతను పవర్ ప్లేలో ఐదో ఓవర్ వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఓవర్ లో అతను ఏకంగా 15 పరుగులు ఇచ్చి, మ్యాచ్ ను న్యూజిలాండ్ వైపు మళ్లించాడు. మొత్తం రెండు ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చేశాడు.
అలాగే బ్యాటింగ్‌లో కూడా బాజ్వా నెమ్మదిగా ఆడి 39 బంతుల్లో 36 పరుగులు మాత్రమే చేశాడు. ఫ్లాట్ పిచ్ పై ఈ బ్యాటింగ్ స్టైల్ అనేక అనుమానాలకు దారితీసింది. ఈ కారణాల వల్లే అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం బయటకు రావడానికి ‘ది ఫిఫ్త్ ఎస్టేట్’ అనే కెనడియన్ ఇన్వెస్టిగేటివ్ ప్రోగ్రామ్ కీలక పాత్ర పోషించింది. ‘Corruption, Crime and Cricket’ అనే డాక్యుమెంటరీలో కెనడా క్రికెట్ లో ఉన్న అవినీతి వ్యవహారాలను బయటపెట్టింది. దీనిని ఆధారంగా తీసుకుని ఐసీసీ ACU ఈ మ్యాచ్ పై ప్రత్యేక దృష్టి సారించింది.
ఇక్కడ మరో సంచలన విషయం ఏమిటంటే.. దిల్‌ప్రీత్ బాజ్వా టోర్నమెంట్‌కు కేవలం మూడు వారాల ముందు మాత్రమే కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ నిర్ణయం కూడా అనేక అనుమానాలకు కారణమైంది. అలాగే కెనడా మాజీ కోచ్ ఖుర్రం చోహాన్ కు సంబంధించిన ఒక కాల్ రికార్డింగ్ లో జట్టు ఎంపికపై ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడైంది. కొంతమంది ఆటగాళ్లను బలవంతంగా ఎంపిక చేయమని సూచించారని, వారు బుకీలతో సంబంధం ఉండొచ్చని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అవినీతి నిరూపితమైతే, కెనడా క్రికెట్ బోర్డుపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటన ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తుంది.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!