Fake Paneer Racket: అన్నదమ్ముల ‘కల్తీ’ పాపం.. పనీర్ లవర్స్‌కు అలర్ట్.. “మీరు తినేది పనీరా లేక పాయిజనా?”
- 28 క్వింటాళ్ల నకిలీ పనీర్ సీజ్
- నకిలీ పనీర్ రాకెట్ గుట్టురట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Paneer Racket: ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న కల్తీ మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఓ ఇద్దరు అన్నదమ్ముల ‘కల్తీ’ పాపం ప్రజల ఆరోగ్యంపై విశేష ప్రభావం చూపే ప్రమాదం నుంచి అధికారులు జనాలను కాపాడారు. మీరట్ పరిధిలోని జానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా కుంభా గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న రెండు నకిలీ పనీర్ ఫ్యాక్టరీలపై లక్నో ఆహార విభాగం అధికారులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. అసలు ఏం జరిగిందంటే..
Also Read
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
నగ్లా కుంభా గ్రామానికి చెందిన హమీద్, జాబిర్ అనే అన్నదమ్ములు ఎటువంటి అనుమతులు లేకుండా సొంతంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి నకిలీ పనీర్ తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఎన్‌సీఆర్ (NCR) ప్రాంతాలకు ఈ కల్తీ పనీర్‌ను సరఫరా చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కమిషనర్ డాక్టర్ రోషన్ జాకబ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడుల్లో హమీద్ ఫ్యాక్టరీ నుంచి 16 క్వింటాళ్లు, జాబిర్ ఫ్యాక్టరీ నుంచి 12 క్వింటాళ్ల నకిలీ పనీర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలలో నిర్వహించిన సోదాల్లో అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. పనీర్ తయారీ కోసం ఈ అన్నదమ్ములు కేవలం పాలు మాత్రమే కాకుండా.. భారీ మొత్తంలో పామొలిన్ ఆయిల్, మైదా పిండి, నీలి రంగులో ఉన్న అనుమానాస్పద కెమికల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. సోదాల్లో లభ్యమైన 5300 లీటర్ల పాలు, 510 లీటర్ల రిఫైన్డ్ పామొలిన్ ఆయిల్, 35 కిలోల మైదా, కెమికల్స్‌ను అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల రాకను గమనించిన నిందితులు హమీద్, జాబిర్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలను సీల్ వేసినట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?