RR Manager: రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌కు రూ. లక్ష జరిమానా.. బుడ్డొడు (వైభవ్ సూర్యవంశీ) జస్ట్ మిస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి బిందర్ డగౌట్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు జరిమానా విధించారు. అసలేం జరిగిందంటే.. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమి బిందర్ డగౌట్‌లో ఫోన్ వాడుతూ కనిపించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ నడుస్తున్నప్పుడు డగౌట్ పరిసరాల్లో మొబైల్ ఫోన్లు వాడటం పూర్తిగా నిషిద్ధం. ఆటలో ఎటువంటి అవినీతి జరగకుండా.. సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఈ నియమం ఉంది. అయితే.. రోమి బిందర్ ఫోన్ వాడుతుండగా, ఆయన పక్కనే కూర్చున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా ఆ స్క్రీన్ వైపు చూడటంతో ఈ విషయం పెద్ద వివాదంగా మారింది.
బీసీసీఐ విచారణ ..
ఈ ఘటనపై బీసీసీఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం (ACSU) వెంటనే స్పందించి రోమి బిందర్‌కు నోటీసులు ఇచ్చింది. దీనికి ఆయన 48 గంటల్లోపే సమాధానం ఇచ్చారు. తాను ఫోన్ వాడటానికి గల కారణాలను వివరిస్తూ.. తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా అధికారులకు సమర్పించారు. తన ఆరోగ్యం దృష్ట్యా ఆ సమయంలో ఫోన్ వాడటం అత్యవసరమని ఆయన వివరించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
అధికారుల నిర్ణయం..
బిందర్ ఇచ్చిన వివరణతో విచారణాధికారులు సంతృప్తి చెందారు. ఆయన నిజంగానే ఆరోగ్య కారణాల వల్ల ఫోన్ వాడాల్సి వచ్చిందని వారు నమ్మారు. అందుకే ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోకుండా, కేవలం రూ.లక్ష జరిమానా విధించి, భవిష్యత్తులో ఇలా జరగకుండా హెచ్చరిక జారీ చేసి వదిలిపెట్టారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి తెలియజేసింది.
వైభవ్ సూర్యవంశీపై స్పందన..
మేనేజర్ పక్కనే కూర్చుని ఫోన్ చూసిన చిన్న వయసు ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ.. “వైభవ్ ఇంకా చిన్న పిల్లాడు. అతన్ని భయపెట్టడంలో అర్థం లేదు. నిబంధనల గురించి ఫ్రాంచైజీ అతనికి మరింత స్పష్టంగా వివరిస్తే సరిపోతుంది” అని పేర్కొన్నారు. దీంతో ఈ వివాదానికి సానుకూలమైన ముగింపు లభించింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?