How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
- మామిడి పండు ఎంపికలో రంగు కంటే రుచి ముఖ్యము
- మామిడి పండ్లలో అనేక రకాలు – ప్రతి రకానికి ప్రత్యేక రుచి
- అల్ఫోన్సో, కేసర్, బంగినపల్లి, దసేరి వంటి రకాలు ప్రాచుర్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to choose Good Mango: పండ్ల రాజు “మామిడి పండు”. వేసవికాలం వచ్చిందంటే చాలు.. చిన్న , పెద్ద అని తేడా లేకుండా ఇష్టపడే పండు మామిడి పండు. మామిడి పండు తియ్యటి రుచి, సువాసన, ఆకర్షణీయమైన రంగులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అయితే అన్ని మామిడిపండ్లు ఒకేలా ఉండవు. సరైన మామిడిని ఎంచుకోవడం ప్రతిసారి కాస్త కష్టంగా అనిపించొచ్చు. తాజాగా తినడానికి, జ్యూస్‌లు లేదా స్వీట్లు తయారు చేయడానికి సరైన మామిడిని ఎంపిక చేయడం చాలా ముఖ్యం.
మామిడి పండ్లలో వందలాది రకాలు ఉన్నాయి. ప్రతి రకానికి ప్రత్యేక రుచి, గుణం ఉంటుంది. అల్ఫోన్సో మామిడి పండ్లు తియ్యటి రుచి, క్రీమీ టెక్స్చర్తో ప్రసిద్ధి. కేసర్ మామిడి పండ్లు మంచి తియ్యదనంతో డెజర్ట్ లకు బాగా సరిపోతాయి. ఇంకా బంగినపల్లి మామిడిపండ్లు పెద్దగా, సాఫ్ట్‌గా ఉండి అందరి ఫెవరెట్ గా నిలుస్తుంది. దసేరి, లాంగ్రా వంటి రకాలు ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందాయి. విదేశాల్లో అతౌల్ఫో, కెంట్, టామీ అట్కిన్స్ వంటి రకాలూ అందుబాటులో ఉంటాయి.
Also Read
Hardik Pandya vs Bumrah: హార్దిక్-బుమ్రా మధ్య వాగ్వాదం.. ముంబై ఇండియన్స్‌లో అంతా బాగానే ఉందా?
మామిడి పండు రంగు చూసి మాత్రమే అది పండిందో లేదో నిర్ణయించలేము. కొన్ని రకాలు పసుపు లేదా బంగారు రంగులో ఉంటే అవి పండినవిగా భావించవచ్చు. కానీ ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉన్న కొన్ని రకాలు కూడా పండినవే కావచ్చు. కాబట్టి ఒకే రంగులో ఉండటం, ఎక్కువ మచ్చలు లేకపోవడం ముఖ్యంగా చూడాలి. మామిడి పండు పండిందో లేదో తెలుసుకోవడానికి టెక్స్చర్ చాలా ముఖ్యమైన సూచిక. చేతితో మెల్లగా ఒత్తి చూస్తే కొద్దిగా సాఫ్ట్‌గా అనిపిస్తే అది పండిన పండు. చాలా గట్టిగా ఉంటే ఇంకా పండలేదు. మరీ మృదువుగా, ముద్దగా ఉంటే అది ఎక్కువగా పండిపోయిందని అర్థం.
సువాసన కూడా ఒక సూచిక. మామిడి పండును కాడ దగ్గర వాసన చూస్తే తియ్యటి వాసన వస్తే అది పండినట్లే. వాసన లేకపోతే ఇంకా పండలేదని అర్థం. పుల్లటి లేదా ఫెర్మెంటెడ్ వాసన వస్తే అది ఎక్కువగా పండిపోయిందని గుర్తించాలి. ఇంకా మామిడి తొక్క కూడా పరిశీలించాలి. స్మూత్‌గా, బిగుతుగా ఉండాలి. ముడతలు, కోతలు, నల్ల మచ్చలు ఉంటే ఆ పండు నాణ్యత తగ్గినట్లు అర్థం. అలాగే పండు బరువు కూడా ముఖ్యమే. సైజ్‌కు తగినంత బరువు ఉంటే అది జ్యూసీగా ఉందని భావించవచ్చు.
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!
వాడుకను బట్టి మామిడిని ఎంచుకోవడం మంచిది. తాజాగానా తినాలంటే అల్ఫోన్సో లేదా కెంట్ రకాలు బాగుంటాయి. స్మూతీస్, ప్యూరీలకు అతౌల్ఫో వంటి జ్యూసీ రకాలు సరిపోతాయి. ఆరోగ్యపరంగా కూడా మామిడి పండ్లు ఎంతో ఉపయోగకరం. విటమిన్ C, విటమిన్ A, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడతాయి.
తాజావార్తలు
-
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు బిగ్ రిలీఫ్..!
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
TTD Alert: తిరుమల భక్తులకు అలర్ట్.. అంతవరకు సిఫార్సు లేఖల దర్శనం బంద్..!
-
The Traitors Telugu :’చీప్.. మిడిల్ క్లాస్’.. వర్ష’పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
-
BJP: తిరుగుబాటు కోసమే వియత్నాంకు రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ.!
ట్రెండింగ్
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!