Nagarjuna : మన దేశంలో హీరోలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు వైరల్ అయినంతగా ఇంకేవీ కావు. అయితే సెలబ్రిటీల ఫేక్ ఫొటోలు, వీడియోలను వైరల్ చేయడం ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా వాళ్ల ఫొటోలను ఎడిట్ చేసి వాడుతుంటారు. ఇలాంటి వాటిపై టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి తన పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో, ఈ కామర్స్ వెబ్ సైట్లు, యాప్స్ లలో తన ఫొటోలు, ఏఐ కంటెంట్ వీడియోలు వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరాడు.
Read Also : Rishab Shetty : రిషబ్ శెట్టి గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూళ్లకు సాయం
దాంతో ఢిల్లీ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. నాగార్జున పర్మిషన్ లేకుండా ఎలాంటి వీడియోలు, ఫొటోలు వాడకుండా ఆదేశాలు జారీ చేసింది. ఇది చూసిన బాలీవుడ్ హీరోలు కూడా నాగార్జున బాట పట్టారు. తమకు కూడా నాగార్జున లాంటి న్యాయం కావాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. తమ ఫొటోలు, వీడియోలు వాడకుండా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికే అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ లాంటి వారు కోర్టులో పిటిషన్లు వేశారు. కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తోంది.
Read Also : Hebah Patel : నడుము మడతలు చూపిస్తూ చంపేస్తున్న హెబ్బా పటేల్