సంక్రాంతి సినిమా సందడి మొదలైపోయింది. ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ సినిమాల ట్రైలర్స్ మంచి హైప్‌ను పెంచేశాయి. ఇక లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తా అన్నట్లు.. నాగార్జున కూడా ట్రైలర్ హైప్ పెంచేశాడు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీదర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తే… పర్ఫెక్ట్ పండగ సినిమాలా కనిపిస్తుంది. కిష్టయ్యను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా… అంటూ రచ్చ లేపాడు నాగార్జున. గుంటూరు కారం, హనుమాన్ జనవరి 12న రిలీజ్ అవుతుండగా… సైంధవ్ 13న రిలీజ్ అవుతోంది. చివరగా సంక్రాంతి సీజన్‌కు ఫైనల్ టచ్ ఇస్తూ జనవరి 14న నా సామిరంగ థియేటర్లోకి రాబోతోంది. దీంతో ట్రైలర్ మొదలు కొని ఈవెంట్ వరకు… ప్రమోషన్స్ అన్నీ కూడా మిగతా సినిమాల తర్వాతే చేస్తున్నాడు నాగ్.
Read Also: Pooja Hegde : కొబ్బరి చెట్ల మధ్య హంసలా మెరిసిపోతున్న బుట్ట బొమ్మ..
ఇప్పటికే హనుమాన్, సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయిపోయాయి. నిన్ననే మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఈవెంట్ గుంటూరులో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ వంతు వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్లో నా సామిరంగ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దీంతో ఈ ఈవెంట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇదే వేదిక పై నాగ చైతన్య, అఖిల్ కూడా కనిపిస్తారేమో తెలియాల్సి ఉంది. ఇక శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి నా సామిరంగా ఎలా ఉంటుందో చూడాలి.
Read Also: Namrata Shirodkar: మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్! నమ్రత పోస్ట్ వైరల్