సంక్రాంతి సినిమా సందడి మొదలైపోయింది. ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ సినిమాల ట్రైలర్స్ మంచి హైప్‌ను పెంచేశాయి. ఇక లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తా అన్నట్లు.. నాగార్జున కూడా ట్రైలర్ హైప్ పెంచేశాడు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీదర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తే… పర్ఫెక్ట్ పండగ సినిమాలా కనిపిస్తుంది. కిష్టయ్యను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా… అంటూ రచ్చ లేపాడు నాగార్జున. గుంటూరు కారం, హనుమాన్…
ప్రతి ఇయర్ సంక్రాంతిలాగే… ఈ ఇయర్ కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు రేస్ లోకి వచ్చాయి. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. జనవరి 12న హనుమాన్, గుంటూరు కారం… 13న సైంధవ్, 14న నా సామిరంగ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో హనుమాన్ సినిమాకి ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్ సెట్ అయిపోయాయి. జనవరి 11 నుంచి హనుమాన్ పెయిడ్…
అక్కినేని కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ… విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి షూటింగ్ జరుపుకుంటుంది. నాగార్జున 99వ సినిమాగా బయటకి రానున్న నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అవ్వడానికి జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకున్న నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ మంచి జోష్…