కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమాతో రేపు ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. పండక్కి వస్తున్నాం హిట్ కొడుతున్నాం అని కాన్ఫిడెంట్ గా ఉన్న నాగార్జున… నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ తో అక్కినేని అభిమానుల్లో మంచి జోష్ తెచ్చాడు. ఇదే జోష్ లో రేపు థియేటర్స్ కి వెళ్లిపోవడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. రిలీజ్ ముందు రోజు కూడా ప్రమోషన్స్ చేస్తున్న నా సామిరంగ చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తోంది.…
సంక్రాంతి సినిమా సందడి మొదలైపోయింది. ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ సినిమాల ట్రైలర్స్ మంచి హైప్‌ను పెంచేశాయి. ఇక లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తా అన్నట్లు.. నాగార్జున కూడా ట్రైలర్ హైప్ పెంచేశాడు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీదర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తే… పర్ఫెక్ట్ పండగ సినిమాలా కనిపిస్తుంది. కిష్టయ్యను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా… అంటూ రచ్చ లేపాడు నాగార్జున. గుంటూరు కారం, హనుమాన్…
అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’… సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. అయితే… సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో ఇప్పటికే మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, తేజ సజ్జా ‘హనుమాన్’ సినిమాల థియేట్రికల్ ట్రైలర్స్ రిలీజ్ అయిపోయాయి.. సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి కానీ ఇంకా నాగార్జున ‘నా సామిరంగ’…