అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు.. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది ట్యాగ్ లైన్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్య కృష్ణ నటిస్తుండగా.. చై సరసన కృతి శెట్టి నటిస్తోంది.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కృతి శెట్టి లుక్ ని రివీల్ చేయగా.. తాజాగా నాగ చైతన్య లుక్ ని రివీల్ చేశారు.…
కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో హిట్ పెయిర్ నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి జోడి కడుతున్న విషయం తెలిసిందే. నిన్న రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు సినిమా నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నాగార్జున, రమ్యకృష్ణ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఎప్పటిలాగే రమ్యకృష్ణ అందంగా కనిపిస్తుంది. నాగార్జున, రమ్యకృష్ణ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది. పంచెకట్టులో నాగార్జున “బంగార్రాజు” లుక్ అదిరిపోయింది. అప్పట్లో…
కింగ్ నాగార్జున ఆగస్టు 29న తన 62 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులు సోషల్ మీడియా “హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగార్జున పుట్టినరోజు నాడు ఆయన నెక్స్ట్ సినిమాలు “ది ఘోస్ట్”, “బంగార్రాజు” ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఆయన…
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ “బంగార్రాజు” చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తనయుడు అక్కినేని నాగ చైతన్య ఈ పోస్టర్ ను లాంచ్ చేశారు. పోస్టర్ లో నాగార్జున గతంలో నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రంలోని “బంగార్రాజు” పాత్రల్లో కనిపిస్తుండగా మనసును దోచేందుకు డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ రాసుకొచ్చారు. మొత్తానికి ఈ లుక్ ను చూసిన అక్కినేని అభిమానుల్లో…