ETV Prabhakar Reveals his Affair: నటుడు ప్రభాకర్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగు టీవీ ఇండస్ట్రీ మెగాస్టార్ అని ఆయనను పిలుస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా సూపర్ హిట్ సీరియల్స్ చేస్తూ తనకు గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాకర్. ఈటీవీలో ఎక్కువ సీరియల్స్ చేయడంతో ఆయనకు ఈటీవీ ప్రభాకర్ అనే పేరు ఫిక్స్ అయింది. ఇక తన జీవితంలో తనకి ఒక అమ్మాయితో అఫైర్ ఉందని అంటూ ఓ టీవీ కార్యక్రమంలో ఆయన రివీల్ చేశారు. ఆదివారం స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ కార్యక్రమానికి ప్రభాకర్ దంపతులు ఇద్దరూ వచ్చారు.
Artiste : ఇంట్రెస్టింగ్ గా ‘ఆర్టిస్ట్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్
ప్రభాకర్ దంపతులతో పాటు జాకీ దంపతులు ‘కార్తీక దీపం’ సీరియల్ ఫేమ్ నిరుపమ్ పరిటాల దంపతులు, కమెడియన్ యాదమ్మ రాజు దంపతులు ఈ షోకి అటెండ్ అవగా తన భార్యను బాధ పెట్టిన సందర్భం ఒకటి ఉందని ఈటీవీ ప్రభాకర్ చెప్పుకొచ్చారు. తెలిసీ తెలియక చాలా బాధ పెట్టిన సందర్భం ఒకటి ఉందని అంటూ పెళ్లయ్యాక కూడా తనకు ఒక గాళ్ ఫ్రెండ్ ఉండేదని అన్నారు. ఆ విషయం తెలిసి నా భార్య చాలా బాధ పడింది, అయితే నేను ఎలాగో సరి చేసుకుని మనస్ఫూర్తిగా సారీ చెప్పానని అన్నారు. నేను సారీ చెప్పడం పెద్ద గొప్ప విషయం కాదు కానీ తను క్షమించడం అనేది గొప్ప విషయమని ప్రభాకర్ చెప్పారు. ఆ తర్వాత తన భార్యను బుగ్గపై ఆత్మీయంగా ముద్దు పెట్టుకుని షాక్ ఇచ్చారు. ఇక మిగతా జంటలు కూడా అనేక విషయాలు షోలో పంచుకున్నారు.