Naga Vamsi Response on Guntur Kaaram Fake Collections allegations: గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కాస్త సినిమా యూనిట్ పెంచి అనౌన్స్ చేస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇదే విషయం గురించి తాజాగా ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీని ప్రశ్నించారు జర్నలిస్టులు. అదేవిధంగా సినిమాలు రిలీజ్ అయ్యాక రివ్యూస్ సినిమా కలెక్షన్స్ మీద ఏమైనా ప్రభావితం చూపిస్తున్నాయా అని అడిగితే అదేమీ లేదని వంశీ చెప్పుకొచ్చారు. తన సినిమానే ఒకటి సంక్రాంతికి రిలీజ్ అయిందని అజ్ఞాతవాసి గురించి చెబుతూ దానికి నెగిటివ్ టాక్ వచ్చింది కలెక్షన్స్ కూడా రాలేదు. అయితే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ వచ్చాయని వంశీ చెప్పుకొచ్చారు. రివ్యూస్ యూజ్ లెస్ అని పేర్కొన్న నాగ వంశీ ఒక సినిమాని బతికించాలి అన్నా చంపేయాలన్నా కేవలం ప్రేక్షకులు మాత్రమే చేయగలరని చెప్పుకొచ్చారు.
Guntur Kaaram: రివ్యూస్ కి వాల్యూ లేదు.. నాగవంశీ కీలక వ్యాఖ్యలు
ఇక అమెరికాలో తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయనే విషయంలో స్పందిస్తూ అక్కడి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన అవుట్ ఫుట్ తాము ఇవ్వలేకపోయామని వాళ్ళు ఒకటి ఆశిస్తే మన కంటెంట్ మరోలా ఉందని చెప్పుకొచ్చారు. ముందు నుంచి ఇది ఫ్యామిలీ సినిమా అనే విషయాన్ని తాము ప్రచారం చేసుకోలేకపోయామని, ఆడియన్స్ ని ప్రిపేర్ చేయలేకపోయామని అన్నారు. అలాగే ఒక ఫ్యామిలీ కథ చెప్పాలనుకున్నప్పుడు అన్ని వర్గాల ఆడియన్స్ ని కనెక్ట్ అవ్వడం కష్టమేనని అన్ని ఏరియాస్ లోని ఆడియన్స్ ని రీచ్ అవ్వాలని కూడా లేదు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు 10- 12 ఏరియాల్లో సినిమా అమ్మితే పది- పదకొండు ఏరియాస్ లో రీచ్ అయింది ఒకటి రెండు ఏరియాస్ లో రీచ్ అవ్వలేదు, దానికి మనం ఏం చేయలేము అని అన్నారు. ఇక ఫేక్ కలెక్షన్స్ అని ఒక సెక్షన్ మీడియా అంటుంది కదా దానికి మీరేం సమాధానం చెబుతారు అంటే ఫేక్ కలెక్షన్స్ అని ప్రూవ్ చేయమని వంశీ చాలెంజ్ చేశారు. ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్స్ అని చెబుతున్నారు కానీ ముందు వచ్చిన సినిమాలన్నీ జెన్యూన్ కలెక్షన్స్ అని వాళ్ళకి తెలిసింది కదా దాన్ని ఎలా ప్రూవ్ చేశారో నాది కూడా అలాగే ప్రూవ్ చేయాలని ఆయన కోరారు.