Naga Vamsi Crucial Comments on Movie Reviews: మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా 212 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని సినిమా అయినటువంటి అధికారికంగా ప్రకటించింది. అలా ప్రకటించిన కొద్దిసేపటికే సినీ నిర్మాత నాగ వంశీ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన రివ్యూస్ మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు రివ్యూస్ కి వ్యాల్యూ లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో జర్నలిస్ట్ లు మేము రాసిన రివ్యూస్ మిమ్మల్ని హర్ట్ చేసినట్టున్నాయి అంటే నన్నేమీ హర్ట్ చేయలేదు సినిమాని ఏమీ హర్ట్ చేయలేదు, ఆ విషయాన్ని చెబుదామని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టానని చెప్పుకొచ్చారు..
Naga Vamshi: ఆ షో వేసి తప్పు చేశా… సలార్ కి దీనికి ఉన్న తేడా అదే
సినిమా కలెక్షన్స్ ని రివ్యూస్ ఏ మాత్రం డామేజ్ చేయలేదని విషయం చెప్పడానికి మీడియా ముందుకు వచ్చానని మీరందరూ ఏదో ఇంటలెక్చువల్ ఒపీనియన్ ఇచ్చేశాం అనే ఫీలింగ్ లో ఉన్నారు కదా అదంతా తప్పు అయింది అని మీకు చెప్పాలి కదా, కలెక్షన్స్ బాగున్నాయని చెప్పాలి కదా అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టామని అన్నారు. రివ్యూస్ వల్ల ఎలాంటి నష్టం జరగలేదని కలెక్షన్స్ బాగున్నాయి అని మాత్రమే చెప్పగలం కదా ఇంకా ఎలా చెప్పగలం అని వంశీ ప్రశ్నించారు. దీంతో జర్నలిస్టులు సినిమాని రివ్యూలు డిసైడ్ చేయలేవు టూ స్టార్ రేటింగ్ ఇచ్చిన సినిమాలు 500 కోట్లు కలెక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఫోర్ రేటింగ్ ఇచ్చిన సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా అవ్వని పరిస్థితులు ఉన్నాయి కదా అని అన్నారు. అదే తాను చెప్పాలనుకుంటున్నానని అసలు సినిమా రివ్యూస్ కి వాల్యూ లేదని నాగ వంశీ చెప్పుకొచ్చారు.