Tillu Square: నాగవంశీ సంచలన నిర్ణయం.. మీడియాకి నో షోస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Media Show for Tillu Square: డిజె టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా తెరకెక్కింది. మొదటి సినిమాలో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో కూడా హీరోగా నటిస్తుండగా హీరోయిన్ మాత్రం మారింది. మొదటి భాగంలో నేహా శెట్టి రాధిక అనే పాత్రలో కనిపించగా ఇప్పుడు లిల్లీ అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డిజె టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ టిల్లు స్క్వేర్ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విషయంలో నిర్మాత నాగ వంశీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించి మీడియా కోసం ఎలాంటి స్పెషల్ షో వేయడం లేదు.
Bade Miyan Chote Miyan Trailer: ఈ ప్రపంచం ఇంతవరకు ఇలాంటి యుద్దాన్ని చూసి ఉండదు!
Also Read
సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న మీడియా కోసం ఒక ప్రెస్ ప్రీమియర్ ప్రదర్శించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కొన్ని సినిమాలను ముందు రోజే మీడియా కోసం ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సినిమాలను మాత్రం రిలీజ్ అయిన రోజు ఉదయం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి స్పెషల్ ప్రీమియర్ వేయకూడదు అని నాగవంశీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలా ఏ సినిమా నిర్మాత ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. కొంత కాలం క్రితం ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ సమయంలో పూరీ జగన్నాథ్ మాత్రమే ప్రెస్ కి షో వేయలేదు. సినిమా మీద నమ్మకంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో పాటు రివ్యూస్ మీద కాస్త నెగటివ్ అభిప్రాయం కలిగిన నాగ వంశీ ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రచారమే కాగా నిజంగా ప్రెస్ ప్రీమియర్ ప్లాన్ చేయలేదా ? అనే విషయం మీద రేపటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..