Bade Miyan Chote Miyan Trailer: ఈ ప్రపంచం ఇంతవరకు ఇలాంటి యుద్దాన్ని చూసి ఉండదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bade Miyan Chote Miyan Trailer Released: బాలీవుడ్ యాక్టర్స్ అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’, ఈద్ సందర్భంగా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ,సాంగ్స్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ని భారీగా పెంచాయి. అక్షయ్ ఈ సినిమాతో హిట్ కొట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.దానికి తగ్గటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసి ప్రమోషన్ ని పీక్స్ కి చేర్చారు మేకర్స్. ఉగాది , ఈద్ పండగల నేపథ్యంలో ఏప్రిల్ 10న ఈ ప్రాజెక్ట్ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ తో బడేమియా చోటేమియా కథని అరటిపండు వలిచినట్టు చెప్పేశారు మేకర్స్.ఒకడు ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేస్తూ దేశానికి చీడపురుగులా మారతాడు. అతనెలా ఉంటాడో ఎవరికి తెలియదు. వాడిని పట్టుకోవడం కోసం ఇద్దరు సైకో ఆర్మీ ఆఫీసర్లని రంగంలోకి దింపుతుంది గవర్నమెంట్. ఇంత పెద్ద రక్షణ వ్యవస్థ చేయలేని పనిని వాళ్లిద్దరూ ఎలా చేశారు అనేది బడేమియా చోటేమియా స్టోరీ.
Allu Arjun: టుస్సాడ్స్ లో బన్నీ మైనపు విగ్రహం.. ఇందులో రియల్ అల్లు అర్జున్ ఎవరో గుర్తు పట్టారా?
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశాడు డైరెక్టర్. విలన్ గా పృథ్వీరాజ్ సుకుమార్ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తుంటే హై ఓల్టెజ్ యాక్షన్ తో చెలరేగిపోయారు అక్షయ్ , టైగర్ ష్రాఫ్. ట్రైలర్ మొత్తం చూస్తుంటే ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్‌లో ఉంది. పాజిటివ్ టాక్ రావాలేగానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ అవ్వడం పక్కా.మరి ఏప్రిల్ 10న ఏం జరుగుతుందో చూడాలి. అలీ అబ్బాస్ జాఫర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మానుషి చిల్లర్, అలయ హీరోయిన్లగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సుల్తాన్, టైగర్ జిందా హై వంటి పలు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించగా వశు భగ్నానీ, దీప్షికా దేశముఖ్, జాకీ భగ్నానీ నిర్మించారు. రంజాన్ ఈద్ కానుకగా ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడం పక్కా అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!