Custody Teaser: అక్కినేని నాగచైతన్య.. లవ్ స్టోరీ సినిమా తరువాత ఒక మంచి హిట్ అందుకున్నది లేదు. ఒకటి రెండు సినిమాలు చేసినా అవి పరాజయాన్ని అందుకున్నాయి. దీంతో చై ఈసారి మంచి హిట్ కొట్టాలని గట్టి పట్టుదల మీద ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చై సరసన కృతి శెట్టి నటిస్తుండగా.. కోలీవుడ్ సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
MM. Keeravani: ఇది లోకంలోనే అత్యంత అరుదైన గిఫ్ట్… నా కన్నీళ్లు ఆగడం లేదు
టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఈ చిత్రంలో చై పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. “గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తోంది.. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఒక యుద్దానికి..” అంటూ చై వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమయ్యింది. కథను మొత్తం రివీల్ చేయకపోయినా.. ఒక పోలీసాఫీసర్.. ఒక నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తుండడం.. దాన్ని విలన్ గ్యాంగ్ అడ్డుకోవడం కనిపిస్తోంది. “నిజం ఒక దైర్యం.. నిజం ఒక సైన్యం.. అవును.. ఆ నిజం నా కస్టడీలో ఉంది” అని చై చెప్పడంతో కథపై ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు ఆ నిజం ఏంటి..? ఏ నిజం కోసం హీరో పోరాడాడు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమాకు హైలైట్ అంటే ఇళయరాజా సంగీతం అనే చెప్పాలి. మ్యూజిక్ మ్యాస్ట్రో సంగీతం ఆకట్టుకొంటుంది. మొత్తానికి టీజర్ తో మంచి హైప్ క్రియేట్ చేశాడు దర్శకుడు. ఇకపోతే ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చై మంచి హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.