Naga Chaitanya : హీరో నాగచైతన్యకు శోభితకు ఓ సినిమా వల్ల గొడవ అయిందంట. ఈ విషయాన్ని తాజాగా ఈ హీరో బయట పెట్టాడు. సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు నాగచైతన్య గెస్ట్ గా వచ్చాడు. ఇందులో నాగచైతన్య తన భార్య శోభితతో జరిగిన ఓ గొడవ గురించి బయట పెట్టాడు. తండేల్ సినిమా తర్వాత నాతో శోభిత మాట్లాడటలేదు. ఆ మూవీ విషయంలో గొడవ పడింది. ఎందుకంటే నేను శోభితను ఎప్పటి నుంచో బుజ్జితల్లి అని పిలుస్తుంటాను. తండేల్ సినిమాలు అనుకోకుండా సాయిపల్లవికి పాత్రకు కూడా బుజ్జితల్లి అనే పేరు పెట్టాం. ఆ పేరు పెట్టడం వల్ల శోభిత అలిగింది. అందుకే మూడు రోజులు నాతో మాట్లాడలేదు అంటూ తెలిపాడు చైతూ.
Read Also : Allari Naresh : పాములకు భయపడి.. బ్లాక్ బస్టర్ మూవీని వద్దన్న అల్లరి నరేశ్..
అలాంటి గిల్లికజ్జాల గొడవలు ఉండాలి కదా సంసారంలో అంటూ జగపతి బాబు అన్నాడు. అవునండి ఉండాల్సిందే. ఆ గొడవలు లేకపోతే అది నిజమైన రిలేషన్ షిప్ అనిపించుకోదు అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య. దీంతో అతను చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య, శోభిత ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరూ తరచూ దిగిన ఫొటోలను పంచుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన పిక్స్ ను అభిమానులకు షేర్ చేస్తారు. శోభితకు చైతూ కార్ రేసింగ్ కూడా నేర్పించాడు. ఇక ప్రస్తుతం చైతూ కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. అలాగే శోభిత తమిళ డైరెక్టర్ పా రంజిత్ సినిమాలో నటిస్తోంది.
Read Also : Shilpa Shetty : పోలీసుల ముందు విచారణకు హాజరైన స్టార్ హీరోయిన్